జాతీయ వార్తలు

విశాఖ-చెన్నై కారిడార్‌కు 2500 కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి 375 మిలియన్ డాలర్ల (రూ.2500 కోట్లు) రుణం గ్రాంట్ల ద్వారా ఇచ్చేందుకు ఆసియన్ అభివృద్ధి బ్యాంక్ (ఎడిబి) ఆమోదం తెలిపింది. ఈస్ట్‌కోస్ట్ ఎకనామిక్ కారిడార్ అభివృద్ధిలో భాగంగా మంగళవారం భారత ప్రభుత్వం, ఎడిబి మధ్య ఒప్పం దం కుదిరింది. ప్రాజెక్టు ఒప్పందంపై ఏపీ తరపున ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి హేమ ముని వెంకటప్ప కూడా సంతకం చేశారు. ఈస్ట్‌కోస్ట్ ఎకనామిక్ కారిడార్ మొత్తం 2,500 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉండగా, మొదటి దశలో 800 కిలోమీటర్ల విశాఖపట్నం -చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ఈ రుణాన్ని వెచ్చిస్తారు. దీనితోపాటుగా కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.1433 కోట్ల నిధులను కేంద్రం సమీకరించనుంది. అలాగే అన్ని ఆమోదాలను అమలులోకి తీసుకొస్తూ ఫిబ్రవరి 23న రూ.833 కోట్లు రుణం ఇచ్చేందుకు కేంద్రం ఎడిబి సంతకాలు చేశాయి. మంగళవారం నాడు తాజాగా రూ.33కోట్ల గ్రాంటు, రూ. 1633 కోట్ల రుణం ఇచ్చేందుకు సంతకాలు చేశాయి. ఈ కారిడార్‌లో విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, ఏర్పేడు, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కోసం ఎడిబి రూ.3,335 కోట్లను సమకూర్చనుంది. అలాగే కాకినాడ పోర్టునుంచి జాతీయ రహదారి-16 మధ్య 29.6 కిలోమీటర్ల మేరకు రాష్ట్ర రహదారికి నాలుగు లైన్లకోసం ఈ 1633 కోట్ల రూపాయల రుణాన్ని ఉపయోగించనున్నారు. దాంతోపాటుగా విశాఖకు నీటి సరఫరా విశాఖపట్నం, నాయుడుపేట, ఏర్పేడు, శ్రీకాళహస్తి పారిశ్రామిక క్లస్టర్లలో విద్యుత్ సరఫరాకోసం వెచ్చిస్తారు. ఒప్పందాలపై సంతకాలు చేసిన ఆర్ధిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఈ కారిడార్ అభివృద్ధి మేక్ ఇన్ ఇండియాలో కీలకం కానుందని వెల్లడించారు.