జాతీయ వార్తలు

పట్టణ ప్లానింగ్‌లో హైదరాబాద్‌కు నాలుగోస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశంలో వివిధ నగరాల్లో హైదరాబాద్ నగరానికి పట్టణ ప్లానింగ్‌లో నాలుగో స్థానం, పట్టణ పరిపాలనలో ఐదోస్థానం లభించింది. దేశం వ్యాప్తంగా ఉన్న నగరాల్లో నాలుగు అంశాల్లో జనాగ్రహ అనే స్వచ్ఛంద సంస్థ 2016 సంవత్సరానికి ర్యాంకులను మంగళవారం నాడు ఢిల్లీలో ప్రకటించింది. మొత్తం 80 అంశాలను పరిగణలోకి తీసుకోన్న ఈ సంస్థ మొత్తం 21 నగరాల్లో అధ్యయనం చేసి ర్యాంకులను ప్రకటించింది. పట్టణ పరిపాలనలో సగటునా గతం సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా తిరువనంతపురం మొదటి స్ధానంలో నిలించింది. ఆ తర్వాత స్థానాలలో పూణే, కోల్‌కత్తా, ముంబాయి నగరాలు 2,3,4 స్థానంలో నిలిచాయి. 2015లో హైదరాబాద్ ఆరవస్థానంలో ఉండగా, ఈ సారి తన స్థానాన్ని మెరుగుపర్చుకోని ఐదవ స్ధానంలో నిలిచింది. పట్టణ ప్లానింగ్‌లో ఢిల్లీ నగరం 3.7 మార్కులతో తొలిస్థానంలో నిలవగా, భువనేశ్వర్ 3.1 మార్కులతో 2వ స్థానం, కోల్‌కత్తా 3.0 మార్కులతో 3వ స్థానాల్లో నిలిస్తే, ఇక హైదరాబాద్ నగరం 2.9 మార్కులతో 4వ స్థానంలో నిలించింది. పరిపాలన, ప్లానింగ్, పౌరులకు లభించాల్సిన సౌకర్యాలు, స్థానిక సంస్థల ప్రతినిధుల బాధ్యత అన్ని పరిగణలోనికి తీసుకొని సర్వే నిర్వహించి ఫలితాల వెల్లడితో పనితీరును మెరుగుపర్చుకోవడానికి వీలవుతుందన్న ఉద్దేశంతోనే ర్యాంకులు ప్రకటిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.