జాతీయ వార్తలు

నాగా ఒప్పందాన్ని బహిర్గతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఫిబ్రవరి 28: నాగా ఒప్పందంలో ఏముందో బహిర్గం చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సంతకం చేసిన నాగా ఒప్పందంపై ఎందుకు గోప్యత పాటిస్తున్నారని మంగళవారం ఇక్కడ ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వం నాగా ఒప్పందంపై సంతకం చేసింది. ఒప్పందంలో ఏముందో ఎవరికీ తెలియదు. కనీసం ముఖ్యమంత్రి వొక్రామ్ ఇబోబి సింగ్‌కు కూడా తెలియకుండా చీకట్లో ఎందుకు ఉంచుతున్నారు?’ అని రాహుల్ నిలదీశారు. ఇక్కడో ఎన్నికల సభలో మాట్లాడిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ పర్యటిస్తే అక్కడ విద్వేషాలు రెచ్చగొడుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోదరుల్లా ఉంటున్న ప్రజల మధ్య శత్రుత్వం పెంచుతున్నారని మోదీపై విరుచుకుపడ్డారు. ‘ప్రధాని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ అవినీతికి పాల్పడ్డారంటూ అభూతకల్పనతో కూడిన ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. తనతోపాటు ముఖ్యమంత్రి ఇబోబి సింగ్, రాష్ట్ర ప్రజలు నాగా ఒప్పందంలో ఏం ఉందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నాగా ఒప్పందంలోని అంశాలన్నీ ఇంటర్నెట్‌లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘ఒప్పందం పేరుతో మణిపూర్ ప్రాదేశిక ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారు’ అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మణిపూర్ ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయని ఆయన అన్నారు. పెద్దనోట్ల రద్దు దేశంలోని పేద ప్రజల జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. రైతులు, రోజువారీ వేతన జీవులు అనేక ఇబ్బందులు పడ్డారని రాహుల్ పేర్కొన్నారు.

చిత్రం..ఇంపాల్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తమ సంప్రదాయ రీతిలో అలంకరించి మురిసిపోతున్న స్థానిక నేతలు. చిత్రంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఇబోబి సింగ్ తదితరులు