జాతీయ వార్తలు

అసహనానికి తావులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, మార్చి 2: భారత దేశంలో అసహనానికి తావులేదని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. విద్యా బోధన చేసి దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే వర్శిటీలు అశాంతి సంస్కృతికి వేదికలు కాకూడదని హెచ్చరించారు. అర్థవంతమైన చర్చలు, సంప్రదింపులే వీటికి కీలకం కావాలని ‘ఇండియా ఎట్ 70’పై గురువారం చేసిన కెఎస్ రాజముని సంస్మరణోపన్యాసంలో పిలుపునిచ్చారు.వర్శిటీలే ఉన్నత విద్యను పెంపొందించే సాధనాలని, విజ్ఞాన సమాజ ఆవిర్భావానికి అవి దోహదం చేయాలని అన్నారు. ఈ విజ్ఞాన దేవాలయాలు సృజనాత్మకత, స్వేచ్ఛాయుత ఆలోచనలు వెల్లువెత్తాలే తప్ప అశాంతికి ఇవి నిలయాలు కాకూడదని ఉద్బోధించారు. అయితే ఈ వర్శిటీలు హింస, అశాంతిమయం కావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రాలకు అనాధిగా భారత్ బలమైన పునాదిగా భాసిల్లుతూ వస్తోందని అన్నారు. వాక్సాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాధమిక హక్కులని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే ప్రధాన లక్షణంగా భారత సమాజం తన ప్రత్యేకతను చాటుకుందని, అలాంటి చోట అసహన ధోరణులకు తావే లేదని తేల్చిచెప్పారు. విమర్శించడం, విభేదించడం అన్నవి భిన్నత్వంలో ఏకత్వ భావనకు సంకేతాలని ఉద్ఘాటించారు. ముఖ్యంగా చట్టసభ సభ్యులు ప్రజలతో మమేకమై పని చేయాలే తప్ప తామే సర్వస్వంగా వ్యవహరించకూడదన్నారు. చట్టాల రూపకల్పనలో మమేకం కావడంతో పాటు ప్రజల సమస్యలను తీర్చడమే వారి బాధ్యత కావాలన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ముకానీవ్వకూడదని వారికి విజ్ఞప్తి చేశారు.

చిత్రం..కొచ్చిలో గురువారం జరిగిన సెమినార్‌కు హాజరైన రాష్టప్రతి ప్రణబ్. కేరళ గవర్నర్ సదాశివం (ఎడమ) ముఖ్యమంత్రి విజయన్(కుడి)లను ఈ చిత్రంలో చూడవచ్చు.