జాతీయ వార్తలు

జీవరసాయన ఆయుధాలతో ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: పాకిస్తాన్ సైన్యం వద్ద అత్యంత ప్రమాదకరమైన జీవరసాయనాయుధాలు ఉన్నట్లుగా తెలుస్తోందని, శత్రువు నుంచి ఎదురయ్యే ఏ సవాలునైనా దీటుగా ఎదుర్కోవటానికి సైన్యం సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ భారత సైన్యానికి పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన డిఆర్‌డిఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యం అఫ్గానిస్తాన్‌తో పాటు ఉత్తర ప్రాంతాల్లో రసాయన ఆయుధాలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం వస్తోందని, అఫ్గానిస్తాన్‌తోపాటు కొన్ని ఇతర ప్రాంతాల నుండి సేకరించిన ఫొటోలు చూస్తుంటే ఈ అనుమానం కలుగుతోందని చెప్పారు. పాకిస్తాన్ సైన్యం ఏ మేరకు రసాయన ఆయుధాలను సేకరించిందనేది ఖచ్చితంగా చెప్పలేమని, ఫొటోల్లో ఉన్న వారిని చూస్తుంటే రసాయన ఆయుధాల ప్రభావం కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. మనం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ రసాయన ఆయుధాల గురించి తానిప్పుడే ఏమీ చేప్పలేనంటూ మనం అణు, జీవ, రసాయన యుద్ధాన్ని ఎదుర్కోగలగాలన్నారు. త్రివిధ దళాల కోసం డిఆర్‌డిఓ తయారు చేసిన పలు ఆయుధాలు, పరికరాలను భారత సైన్యానికి ఆయన అందజేశారు. డిఆర్‌డిఓ తయారు చేసిన శత్రువుల ఆయుధాలను గుర్తించే రాడార్, డబ్బు, ఎల్‌ఆర్, స్వాతి, న్యూక్లియర్ బయోలాజికల్ కెమికల్స్, ఎన్‌బిసి, రెక్కీ వాహనాలు, ఎన్‌బిసి మందులను ఆయన సైన్యానికి అందజేశారు. సరిహద్దుకు అవతల ఉండే శత్రువుల ఆయుధాలను గుర్తించే పరికరాల వల్ల మన సైన్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. వీటి సహాయంతో శత్రువులను సునాయసంగా ముందే దెబ్బ తీయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. భారత సైన్యం ఆధునీకరణలో డిఆర్‌డిఓది కీలక పాత్ర అన్నారు. డిఆర్‌డిఓ తయారు చేసిన పరికరాలు, ఆయుధాల వలన భారత సైన్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతోందని సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. ఆధునిక యంత్ర పరికరాలను తయారు చేసినందుకు ఆయన డిఆర్‌డిఓకు అభినందనలు తెలిపారు. డిఆర్‌డిఓ తయారు చేసిన డబ్లుఎల్‌ఆర్ పరికరం ఎలక్ట్రానికల్ స్కానింగ్ సి బ్యాండ్ అర్రె రాడార్ తనంతట తానే శత్రు భూభాగంలో 30కిలోమీటర్ల వరకు మోహరించిన ఆర్టిలరీ, మోర్టార్లు, రాకెట్ లాంచర్లను పసిగడుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు శత్రువులపై మనం ప్రయోగించిన ఆర్టిలరీ బాంబులు నిర్దేశిత లక్ష్యాన్ని చేధించాయా? లేదా? ఛేదించటం వలన ఏ మేరకు శతృవు దెబ్బతిన్నాడనేది కూడా అంచనా వేస్తుందన్నారు. ఎన్‌బిసి రెక్కీ వాహనం యుద్ధ సమయంలో వాతావరణంలో అణు, బయోలాజికల్, రసాయనాల స్థితిగతులను పసిగట్టి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించటంలో తోడ్పడుతుందని ఆయన తెలిపారు.