జాతీయ వార్తలు

దేశ చరిత్ర తెలియకపోతే భవిష్యత్తు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 23: భారత దేశ ప్రాచీన సంస్కృతిని పరిరక్షించి ప్రదర్శించాల్సిన అవసరం ఎంతయినా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అంటూ, సుసంపన్నమైన భారతీయ చరిత్ర గురించి తెలియని వారికి వర్తమానం ఉంటే ఉండవచ్చునేమో కానీ భవిష్యత్తు మాత్రం లేదని అన్నారు. ‘మన సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే ప్రాచీన నాణేలు, నోట్లు, తాజాగా వచ్చిన స్టాంప్‌లను అర్థం చేసుకుంటే మంచిది. మనమేమిటో అర్థం చేసుకోవడానికి ఇదే సరయిన మార్గం. ఆ కాలం నాటి పరిస్థితిని చూపించడానికి ప్రాచీన కాలం నాటి కరెన్సీ ప్రధాన పాత్ర పోషిస్తుంది’ అని ఫడ్నవిస్ చెప్పారు. నాణేలు, కరెన్సీలు, స్టాంప్‌ల వార్షిక ప్రదర్శన అయిన ‘శుక్లా డే’ 25వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం పాతకాలపు నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంపుల ఆన్‌లైన్ మ్యూజియం అయిన ‘డబ్ల్యు డబ్ల్యుడబ్ల్యు. మింటేజ్ ఇండియా. కామ్’ను ప్రారంభించిన అనంతరం ఆహూతులనుద్దేశించి ఫడ్నవిస్ మాట్లాడారు. ‘సుసంపన్నమైన మన సంస్కృతిలో ఇవి ఒక నాగమని నేను భావిస్తున్నాను. వీటిని చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది’ అని ఆయన అన్నారు. అంటూ, చరిత్ర అంటే తనకు కూడా ఎంతో ఇష్టమన్నారు. చరిత్ర గురించి తెలియని వారికి వర్తమానం ఉంటే ఉండవచ్చు కానీ భవిష్యత్తు మాత్రం కచ్చితంగా ఉండదు. దేశ చరిత్ర గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాలని ఆయన అన్నారు.