జాతీయ వార్తలు

బినామీ లావాదేవీలు జరిపితే ఎడాపెడా శిక్షలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: బినామీ లావాదేవీలు జరిపే వారు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను ఎదుర్కోవడంతో పాటుగా ఆదాయం పన్ను చట్టం కింద భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆదాయం పన్ను శాఖ శుక్రవారం హెచ్చరించింది. ‘1988 నాటి బినామీ లావాదేవీల చట్టం ఇప్పుడు 2016 నవంబర్ 1నుంచి అమలులోకి వచ్చింది గనుక బినామీ లావాదేవీలకు పాల్పడవద్దు. నల్లధనం అనేది మానవత్వానికే మాయని మచ్చ. దీన్ని అంతమొందించడంలో ప్రభుత్వానికి సాయపడమని మనస్సాక్షి కలిగిన ప్రతి పౌరుడిని మేము అభ్యర్థిస్తున్నాం’ అని శుక్రవారం ప్రముఖ జాతీయ పత్రికల్లో జారీ చేసిన ప్రకటనల్లో ఐటి శాఖ పేర్కొంది. కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను కూడా ఆ శాఖ ఆ ప్రకటనల్లో వివరించింది. బినామీదారు(బినామీ ఆస్తి ఎవరి పేరుతో ఉందో అతను), లబ్ధిదారుడు (వాస్తవంగా డబ్బు చెల్లించిన వ్యక్తి) అలాగే బినామీ లావాదేవీలకు ప్రోత్సహించిన వ్యక్తులు అందరూ కూడా విచారించదగిన వారవుతారని 7 ఏళ్ల దాకా కఠిన కారాగార శిక్షతో పాటుగా బినామీ ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం దాకా జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆ శాఖ తెలిపింది.
అంతేకాదు బినామీ చట్టం కింద అధికారులు తప్పుడు సమాచారం సమర్పించిన వారు కూడా విచారణకు గురి కావలసి ఉంటుందని, అయిదేళ్ల దాకా జైలుశిక్షతో పాటుగా బినామీ ఆస్తి మార్కెట్ విలువలో పది శాతం దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆ ప్రకటనలో తెలియజేవారు. అలాగే బినామీ ఆస్తిని ప్రభుత్వం జప్తు చేసి వేలం కూడా వేయవచ్చని కూడా ఆదాయం పన్ను విభాగం తెలిపింది. 1961 నాటి ఆదాయం పన్ను చట్టం లాంటి ఇతర చట్టాల కింద తీసుకునే చర్యలకు ఇవి అదనమని కూడా ఆ శాఖ స్పష్టం చేసింది.
గతఏడాది ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటినుంచి ఆదాయం పన్ను విభాగం దేశవ్యాప్తంగా 230కి పైగా కేసులు నమోదు చేసి రూ.50 కోట్ల విలువైన ఆస్తులను జప్తుచేసింది. పెద్దనోట్ల రద్దు తర్వాత నల్లధనంపై చర్యలు కూడా ఇదే సమయంలోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చట్టం కింద ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య దాకా మొత్తం 235 కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాదు సుమారు 200 కోట్ల విలువైన బినామీ ఆస్తులకు సంబంధించిన 140 కేసుల్లో ఆస్తుల జప్తు కోసం షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. 124 కేసుల్లో ఇప్పటివరకు రూ.50 కోట్ల విలువైన బినామీ ఆస్తలను జప్తు చేయడం కూడా జరిగిందని పిటిఐ సంపాదించిన ఆదాయం పన్ను శాఖ నివేదికను బట్టి తెలుస్తోంది.