జాతీయ వార్తలు

సరస్వతి నది తవ్వకాల్లో ‘హరప్పా’ ముందునాటి అవశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫతేహాబాద్, మార్చి 4: కాలప్రవాహం లో అంతర్వాహినిగా మారిన సరస్వతి నది జాడలు తెలుసుకోవడం కోసం హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలో జరిపిన తవ్వకాల్లో హరప్పా నాగరితకు ముందు నాటి అవశేషాలు బయల్పడ్డాయి. ఇవి దాదాపు 6 వేల ఏళ్ల నాటివిగా భావిస్తున్నారు. నదీ పరీవాహక ప్రాంతం వెంబడి జరిపిన తవ్వకాల్లో బయల్పడిన అవశేషా లు అత్యంత ప్రాచీనమైనవిగా భావిస్తున్నామని, ఎందుకంటే హరప్పా నాగరికత 3,500 ఏళ్ల నాటిది కాగా, హరప్పా నాగరికతకు ముం దు కాలం 5-6 వేల నాటిదని ఫతేహాబాద్ డిప్యూటీ కమిషనర్ ఎన్‌కె సోలంకీ శనివారం చెప్పారు. జిల్లాలోని కునాల్ గ్రామం లోతవ్వకాలు జరిపిన బృం దానికి ఆభరణాలు, పూసలు, ఎముకలు లభించాయని, పురాతత్వ శాఖ వీటిని ఒక మ్యూజియంలో ఉంచుతుంద ని ఆయన చెప్పా రు. కునాల్ గ్రామాన్ని మ్యాపింగ్ చేసిన తర్వాత ఇక్కడ తవ్వకాల పని ప్రా రంభమైందని, ఇక్కడ లభించిన ఇసుక రేణువులను బట్టి గతం లో ఇక్కడ సరస్వ తి నది ప్రవహిస్తూ ఉం డి ఉండవచ్చని భావిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతంలో నది ప్రవహిస్తూ ఉండినట్లు శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నప్పటికీ ఇంకా రుజువుకాలేదని కూడా చెప్పారు.