జాతీయ వార్తలు

రోడ్‌షోలు..నినాదాల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, మార్చి 4: హిందువులకు పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసి శనివారం ఎన్నికల నినాదాలు, రోడ్‌షోలతో హోరెత్తిపోయంది. ప్రధాని నరేద్ర మోదీకి సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం శనివారం ఆయన ఇక్కడకు చేరుకున్నారు. ప్రధాని మోదీ రోడ్‌షోకు అనూహ్య స్పందన కనిపించింది. బిజెపి కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు జేజేలు పలికారు. తూర్పు యూపీలోని 40 నియోజకవర్గాల్లో ఆఖరి విడత పోలింగ్ ఈ నెల 8న పోలింగ్ జరగనుంది. ప్రధాని ఎన్నికల ప్రచారంకోసం అధికార యంత్రాంగం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. పార్టీ నాయకులు అధినేత రాక సందర్భంగా స్వాగతం ఏర్పాట్లు చేశారు. ప్రధాని రోడ్‌షో నాలుగు రోజుల్లో జరగనున్న పోలింగ్‌కు ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. రోడ్‌షోపై స్థానిక టీవీ చానల్స్‌లో విస్తృత ప్రచారం చేశారు. మధ్యాహ్నం వారణాసి చేరుకున్న మోదీ హిందూ సిద్ధాంతకర్త మదన్ మోహన్ మాలవీయ విగ్రహానికి పూలమాలు వేసిన నివాళులర్పించారు. తరువాత బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి రోడ్‌షో ప్రారంభించారు. మోదీ రోడ్‌షో సాగే మార్గం జనంతో కిక్కిరిసిపోయింది. మోదీ, మోదీ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. తరువాత కాశీవిశ్వనాథ్, కాలభైరల ఆలయాల్లో ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పోస్టర్ల వివాదం
ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లు ఉద్దేశపూర్వకంగా తొలగించారని బిజెపి ఆరోపించింది. ఎన్నికల కోడ్ పేరుతో వివక్ష ప్రదర్శించారని బిజెపి అధికార ప్రతినిధి శ్రీకాంత్ శర్మ విమర్శించారు. వారణాసి నగరంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్, బిఎస్పీ రోడ్‌షోల పోస్టర్లు, బ్యానర్లు కట్టారని శనివారం ఇక్కడ తెలిపారు. అయితే పనిగట్టుకుని తమ బ్యానర్లే తొలగించారని ఆయన ధ్వజమెత్తారు. అయితే బిజెపి ఆరోపణలను అధికారులు తోసిపుచ్చారు. ఎన్నికల కోడ్‌ను అనుసరించి తాము నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నామని వారు స్పష్టం చేశారు. రాష్ట్ర అధికార యంత్రాంగం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని శర్మ అన్నారు. శర్మ ఆరోపణలను వారణాసి జోన్ ఐజి ఎన్ రవీందర్ ఖండించారు. చట్ట ప్రకారమే తాము విధులు నిర్వర్తిస్తున్నట్టు ఆయన తెలిపారు.
హోరెత్తిన వారణాసి
యూపీలో ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ప్రచార రంగంలోకి దిగారు. వారణాసిలో ఒకపక్క ప్రధాని మోదీ ప్రచారం చేస్తుండగా, మరోపక్క అధికార ఎస్‌పి-కాంగ్రెస్ అలయెన్స్ తరఫున అఖిలేశ్, రాహుల్, బిఎస్‌పి అధినేత్రి మాయావతి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్చి 8 ఇక్కడ ఏడో (ఆఖరి) విడత పోలింగ్ జరగనుంది.

చిత్రాలు.. వారణాసిలో శనివారం నిర్వహించిన రోడ్ షోలో ఓటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ. అభివాదం
* ఎన్నికల ప్రచారంలో రాహుల్-అఖిలేశ్