జాతీయ వార్తలు

మణిపూర్‌లో రికార్డుస్థాయలో పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, మార్చి 4: మణిపూర్ అసెంబ్లీలో 38 సీట్లకు శనివారం జరిగిన తొలిదశ ఎన్నికల్లో భారీగా ఓట్లు పోలయ్యాయి. 84 శాతం పోలయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటు వేయడానికి జనం బారులుతీరారు. దాదాపు అన్ని బూత్‌ల వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. గత రెండు ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో పోలింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈసారి ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఓఎస్‌డి కరమ్ బోనోసింగ్ అన్నారు. తొలి దశలో 168 మంది అభ్యర్థులు నిలబడ్డారు. అసెంబ్లీ స్పీకర్ టిహెచ్ లోకేశ్వర్ సింగ్, మంత్రులు ఐ హిమోచంద్ర సింగ్, గోవిందాస్ కొంతౌజం, కెహెచ్ రత్నకుమార్ సింగ్, టి మంగ వైఫీ, మణిపూర్ పిసిసి అధ్యక్షుడు టిఎన్ హోకిప్, మాజీ మంత్రులు ఫుంఘ్జతంగ్ టొన్సింగ్, వైఇ సింగ్, బిజెపి నేత టిహెచ్ ఛోబాసింగ్ నియోజకవర్గాలు తొలిదశలో ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఇసి ప్రకటించింది. సినాంలెయికైలో గుర్తుతెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని పిఆర్‌జెఎ కన్వీనర్ ఎరిండ్రో లీచోంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
11 గంటల సమయంలో తన కారుపై ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని ఆయన ఆరోపించారు. హార్వర్డ్ గ్రాడ్యుయేట్, గతంలో ప్రపంచ బ్యాంక్‌లో పనిచేసిన ఎరిండ్రో అక్కడ పోటీ చేస్తున్నారు. అయితే దాడిలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసు అధికారి వెల్లడించారు. తమకు కూడా దాడిపై ఫిర్యాదు చేశారని మణిపూర్ చీఫ్ ఎలక్షన్ అధికారి వివేక్ కుమార్ దేవాంగన్ తెలిపారు. పిఆర్‌జెఏ వ్యవస్థాపకురాలు, మానవ హక్కుల నేత ఇరోం షర్మిల ఖురాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

చిత్రం..ఓటు హక్కును వినియోగించుకున్న ఇరోం షర్మిల