జాతీయ వార్తలు

ఆరో విడత ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 4: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి బుధవారం జరిగిన ఆరోదశ పోలింగ్ 57 శాతం ఓట్లు పోలయ్యాయి. 49 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ పోటీ చేస్తున్న మావు, బిజెపి ఫైర్ బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాలు ఆరో విడతలోనే ఉన్నాయి. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని యూపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడించారు. 63 మంది మహిళలతోసహా 635 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. మొత్తం ఓటర్లు కోటి 72లక్షల మంది. అందులో పురుషులు 94.60 లక్షలు, మహిళలు 77.84 లక్షల మంది ఉన్నారు. మావు, గోరఖ్‌పూర్, మహరాజ్‌గంజ్, కుషీనగర్, డియోరియా, అజాంగఢ్, బాలియా నియోజకవర్గాల్లో ఆరోదశ పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో అజాంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో సమాజ్‌వాదీ పార్టీ తొమ్మిది కైవసం చేసుకుంది. అజాంగఢ్ లోక్‌సభకు ఎస్‌పి చీఫ్ ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈసారి నియోజకవర్గంలో ఎక్కడా ఆయన ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఆదిత్యనాథ్ నియోజకవర్గం, అలాగే కేంద్ర మంత్రి కల్‌రాజ్ మిశ్రాలు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలు ప్రతిష్టాత్మక పోటీ నెలకొంది. ఇక బిజెపి 45 సీట్లకు పోటీచేస్తూ మిత్రపక్షం అప్నాదళ్‌కు ఒక సీటు కేటాయించింది. మిగతా మూడు నియోజకవర్గాల్లో బిజెపి మరో మిత్రపక్షం సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ పోటీలో ఉంది. మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్‌వాదీ పార్టీ మొత్తం 49 సీట్లలోనూ అభ్యర్థులను నిలబెట్టింది. అధికార సమాజ్‌వాదీ పార్టీ 40చోట్ల, దాని మిత్రపక్షం కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఆరో విడత పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో అనేకమంది ప్రముఖులు రంగంలో ఉన్నారు. బిఎస్పీ అభ్యర్థి స్వామి ప్రసాద్ వౌర్య పద్రౌనా (కుషీనగర్), బిజెపి మాజీ అధ్యక్షుడు సూర్యప్రసాద్ సాహీ పథేర్‌దేవా (డియోరియా) శ్యామ్ బహదూర్ యాదవ్ (ఎస్‌పి) ఫుల్‌పూర్ పవాయ్ (అజాంగఢ్) నుంచి పోటీలో ఉన్నారు. శ్యామ్ బహదూర్ యాదవ్ మాజీ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కుమారుడు. అలాగే అంబికా చౌదరి, నారద్ రాయ్ బిఎస్పీ టికెట్‌పై ఫెఫ్నా, బాలియాసదర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. గ్యాగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ మావునుంచి అతడి కుమారుడు అబ్బాస్ ఘోసీ నుంచి పోటీలో ఉన్నారు. 2012 ఎన్నికల్లో 49 సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ 27, బిఎస్పీ 9, బిజెపి 7, కాంగ్రెస్ 4, ఇతరులు రెండుచోట్ల విజయం సాధించారు. గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 23 మంది పోటీ చేస్తున్నారు. మహ్మదాబాద్ ఘోనాలో ఏడుగురు బరిలో ఉన్నారు.

చిత్రం..గోరఖ్‌పూర్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద బారులు తీరిన ఓటర్లు.