జాతీయ వార్తలు

హత్యలు, లూటీల్లోనే అగ్రగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనెభద్ర (ఉత్తరప్రదేశ్), మార్చి 6: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రాష్ట్రాన్ని హత్యలు, లూటీలు, మహిళలపై నేరాలలో మొదటి స్థానానికి తీసుకెళ్లారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని కబేళాలను మూసివేస్తామని ఆయన మరోసారి హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తం స్థానంలో పాలు, నెయ్యిని పారిస్తామని అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక ఎన్నికల సభలో అమిత్ షా మాట్లాడుతూ ‘దయచేసి అఖిలేశ్‌కు ఎలాంటి అన్యాయం చేయకండి’ అని ప్రజలను ఉద్దేశించి అంటూ సిఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉత్తరప్రదేశ్‌ను హత్యలు, లూటీలు, మహిళలపై నేరాల్లో అగ్ర స్థానానికి చేర్చిన అఖిలేశ్ ‘చేసిన పనులే చెబుతాయి’ అంటున్నారని అమిత్ షా మండిపడ్డారు. ‘వాస్తవానికి చేసిన తప్పుడు పనులు చెబుతాయి’ అని ఆయన అన్నారు. గనులున్న ప్రాంతాల్లో గనులపై వచ్చే ఆదాయంలో ఒక శాతాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకున్నారని ఆయన పేర్కొంటూ, సోనెభద్రలో మీరు అలాంటి లబ్ధి పొందుతున్నారా? అని ప్రజలను ప్రశ్నించారు. లేదని ప్రజలు సమాధానమిచ్చారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిఎం అఖిలేశ్ యాదవ్‌లపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రాష్ట్రంలో ఇద్దరు యువరాజులు ఉన్నారు. ఒకరు (రాహుల్ గాంధీ) తన తల్లికి కష్టకాలాన్ని చవిచూపిస్తున్నారు. ఇంకొకరు (అఖిలేశ్ యాదవ్) తన తండ్రికి కష్టకాలాన్ని చవిచూపిస్తున్నారు. ఈ ఇద్దరి భారాన్ని మొత్తం రాష్ట్రం మోస్తోంది’ అని ఆయన అన్నారు. ఎస్‌పి, బిఎస్‌పిల వరుస పాలన వల్ల ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధికోసం బిజెపిని అధికారంలోకి తీసుకు రావాలని ఆయన ఓటర్లను కోరారు.