జాతీయ వార్తలు

బాబుకు సుప్రీం నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓటుకు నోటు కేసుతో ఉన్న సంబంధంపై వైఎస్‌ఆర్‌సిపి శాసన సభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలంటూ చంద్రబాబును కోర్టు ఆదేశించింది. రామకృష్ణారెడ్డి తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తప్పించుకోలేరని సుధాకర్‌రెడ్డి అన్నారు. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, విచారణ సమయంలో వీటిని కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడిన టేపుల్లో ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’ అన్న గొంతు ఎవరిదనే అంశంపై ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించామని ఆయన తెలిపారు.
నోటీసులో ఏముందో తెలీదు: బాబు
గుంటూరు: ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు జారీచేసిన నోటీసులో ఏముందో తనకు తెలీదని సిఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వెలగపూడిలో ఏపి నూతన శాసనసభలో తొలి సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై గతంలో సుప్రీంకోర్టులో 26 కేసులు వేసి ఉపసంహరించుకున్నారన్నారు. ఎక్సైజ్ వ్యవహారంలో కేసు వేస్తే 2012లో విచారణ జరిగిందని తెలిపారు. ఇంతకు ముందు వేసిన కేసుల వల్ల ఏంకాలేదన్నారు. ఇప్పుడు ఆ నోటీసులో ఏముందో తనకు తెలీదని వ్యాఖ్యానించారు.