జాతీయ వార్తలు

సరిహద్దుల్లో మావోల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 6: తెలంగాణ-్ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని బస్తర్ దండకారణ్యంలో మావోయిస్టులు గత రెండు రోజులుగా వేలాది మంది ఆదివాసీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలు హాజరైనట్లుగా సమాచారం. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం పోలీస్ డివిజన్‌లోని చర్లకు సమీపంలోని పూజారి కాంకేర్ ప్రాంతంలోని కొత్తపల్లి వద్ద నంబీగల్‌గడ్ గుట్టల్లో ఈ సమావేశం జరిగినట్టుగా నిఘా వర్గాలు గుర్తించాయి. సమావేశం వివరాలపై నాలుగు రాష్ట్రాల పోలీసు నిఘా వర్గాలు కూపీ లాగుతున్నాయి. లొంగిన నక్సల్స్, ఇన్‌ఫార్మర్ల ద్వారా సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో భారీ విధ్వంసాలకు వ్యూహరచన చేశారా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యులతో పాటు నాలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
నాలుగు ప్రపంచ కార్మిక దినోత్సవాలు
ఈ ఏడాది నాలుగు ప్రపంచ కార్మిక దినోత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర కమిటీ కార్యదర్శి గణపతి పిలుపునిచ్చారు. నక్సల్బరీ సాయుధ తిరుగుబాటుకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా మే 23 నుంచి 29 వరకు, బోల్షివిక్ విప్లవ శతాబ్ధి వార్షికోత్సవాలను మే 7 నుంచి 13 వరకు, కార్ల్‌మార్క్స్ ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలను 2018 మే 5 నుంచి 11 వరకు, సాంస్కృతిక విప్లవం 50వ వార్షికోత్సవాలను నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరింది. దీనికి తోడు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను నిలిపివేత కోసం ఆందోళనలు ఉద్ధృతం చేయాలని రెండు రోజుల సమావేశంలో తీర్మానించినట్లు తెలుస్తోంది. గడిచిన రెండేళ్లలో పార్టీ ఎదుర్కొన్న ఒడిదుడుకుల నుంచి తేరుకుని తిరిగి సరిహద్దుల్లో పట్టు సాధించడం కోసం, దళాల్లో రిక్రూట్‌మెంట్‌ను పెంచుకోవడం ద్వారా తిరిగి ఆత్మస్థైరాన్ని నింపుకోవాలని నాలుగు రాష్ట్రాల పార్టీ నేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. శత్రువు నిర్బంధం నుంచి పార్టీని కాపాడుకోవడం కోసం మిలీషియాను బలోపేతం చేయడంపై దృష్టిసారించాలని నిర్ణయించినట్లుగా సమాచారం. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రపంచ కార్మిక వార్షికోత్సవాలు నిర్వహించడం, పార్టీని బలోపేతం చేయడం, శత్రువును ఎదుర్కోవడం, రిక్రూట్‌మెంట్ తదితర అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరిగినట్లుగా విశ్వసనీయ సమాచారం. సరిహద్దుల్లో మావోయిస్టుల సమావేశం గురించి వివరాలు సేకరించిన ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తమ బలగాలను సిద్ధం చేశారు.