జాతీయ వార్తలు

మాజీ ఐజి కల్లూరికి చత్తీస్‌గఢ్ సర్కార్ నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 6: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ మాజీ ఐజీ ఎస్‌ఆర్‌పి కల్లూరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒకే రోజు ఆయనకు మూడు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. ఇటీవల ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సందేశం తీవ్ర దుమారమే లేపింది. తన ఫోటోతో పాటుగా బదిలీపై వెళ్లిన బస్తర్, సుక్మాల ఎస్పీల ఫోటోలు పెట్టి త్రీ ఇడియట్స్ క్లీన్‌బౌల్డ్ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర డిజిపి ఏఎన్ ఉపాధ్యాయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వాట్సాప్ సందేశంపై వివరణ ఇవ్వాలని, రాయ్‌పూర్ దాటి వెళ్లకూడదని, వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి అని, జగదల్‌పూర్‌లో టాటా కంపెని నిర్వహించిన ప్రైవేటు కార్యక్రమానికి అనుమతి తీసుకోకుండా ఎందుకు వెళ్లారో వివరణ ఇవ్వాలని మొత్తంగా మూడు షోకాజ్ నోటీసులను డిజిపి ఏఎన్ ఉపాధ్యాయ జారీ చేశారు. ఈ నోటీసుల వ్యవహారం ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.