జాతీయ వార్తలు

ఇతర గుర్తింపు కార్డులున్నా చాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 7: ఆధార్ లేక పోవడం వల్ల ఎవరూ ప్రభుత్వ సబ్సిడీలను కోల్పోవాల్సిన అవసరం లేదని కేంద్రం మంగళవారం స్పష్టం చేసింది. ఆధార్‌కు బదులు ఇతర గుర్తింపు కార్డులను చూపించినా ప్రభుత్వ సబ్సిడీ పథకాలు వర్తిస్తాయని ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ స్కాలర్ షిప్‌లు, మధ్యాహ్న భోజన పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాల ఫలాలను పొందాలంటే ఆధార్ తప్పని సరి అంటూ జనశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఆ నేపథ్యంలలోనే ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఆధార్ కార్డు వచ్చే వరకూ ఇతర గుర్తింపు కార్డులను చూపించి సదరు వ్యక్తులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందే వీలుంటుందని ఉద్ఘాటించింది. మధ్యాహ్న భోజన పథకం, సమీకృత శిశు అభివృద్ధి పథకం కింద ప్రయోజనాన్ని వర్తింపజేయాలంటే లబ్ధిదారుల నుంచి ఆధార్‌కార్డు వివరాలు సేకరించాలని అంగన్‌వాడీలు, స్కూళ్లను కోరడం జరిగిందని ఆ అధికారి తెలిపారు. ఒక వేళ ఆధార్ లేక పోతే ఇతర గుర్తింపు కార్డులు చూపించినా సరిపోతుందని, ఆధార్ వచ్చే వరకూ ఈ ప్రయోజనాలు పొందవచ్చునని తెలిపింది. అయితే ఆధార్‌ను తప్పనిసరి చేయడం వల్ల సబ్సిడీ పథకాలను క్రమబద్ధీకరించడం సాధ్యమైందని, దాదాపు 49వేల కోట్ల రూపాయల మేర నిధుల దుర్వినియోగాన్ని నిరోధించగలిగామని ఆ ప్రకటనలో కేంద్రం వెల్లడించింది.