జాతీయ వార్తలు

ప్రధాని పదవి రాసి ఉంటే అవుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఏప్రిల్ 23: బిజెపిని ఓడించడానికి పార్టీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఒక్కటి చేయడానికి ఒక ఉత్ప్రేరక పాత్రను పోషించడానికి తాను ప్రయత్నిస్తున్నాను తప్ప ఏ పదవినీ కోరుకోవడం లేదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. అయి తే ఒక వ్యక్తి ప్రధాని కావాలని రాసిపెట్టి ఉంటే అతను ఏదో ఒక రోజు ప్రధాని అయి తీరుతాడని ఆయన వ్యాఖ్యానించారు. ‘నేను ఏ పదవినీ కోరుకోవడం లేదు. బిజెపికి వ్యతిరేకంగా మనమంతా ఒక్కటి కావాలని నేను అంటున్నాను. ప్రజలను ఒక్కటి కావాలని కోరడం నేరమా?’ అని జెడి (యు) జాతీయ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ ఆయన అన్నా రు. జెడి(యు) నూతన జాతీయ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ ఎన్నికకు ఈ సమావేశం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. నాయకత్వం అంశాన్ని కాలమే నిర్ణయిస్తుందని ఆయన అంటూ, ఒక వ్యక్తి ప్రధాని కావాలని రాసిపెట్టి ఉంటే ఎవరు అవునన్నా కాదన్నా అతను ఏదో ఒకరోజుప్రధాని అవుతారని అన్నారు. అన్నిటికన్నా ముందు మనమంతా బిజెపికి వ్యతిరేకంగా ఒక్కటి కావాలి. ప్రతి ఒక్కరూ కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒక లక్ష్యం కోసం నేను, లాలూజీ త్యాగం చేయకుండా ఉంటే బిహార్‌లో లౌకిక వాదమహా కూటమి రూపు దిద్దుకుని ఉండేది కాదు’ అని నితీశ్ అన్నారు. సంఘ్ పరివార్ విముక్త దేశం కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని , 2019 సాధారణ ఎన్నికల్లో బిజెపిని గద్దె దింపడం కోసం బిహార్ ప్రయోగం జాతీయ స్థాయిలో పునరావృతం కావాలని కొద్దిరోజుల క్రితం నితీశ్ పిలుపునివ్వడంతో అలాంటి కూటమికి ఆయన నాయకత్వం వహిస్తారనే ఊహాగానాలు తలెత్తాయి. ఒక వ్యక్తి ప్రధాని కావాలని రాసి పెట్టి ఉంటే ఎవరు అవునన్నా కాదన్నా అతను ఏదో ఒకరోజు ప్రధాని అవుతాడు.. అంతేకాదు, ఒక వ్యక్తి తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటే అతని కల ఎప్పటికీ సాకారం కాదు’ అని నితీశ్ ఈ రోజు అన్నారు.
జెడి (యు) నూతన అధ్యక్షుడిగా నితీశ్ పేరును ప్రస్తుత అధ్యక్షుడు శరద్ యాదవ్ ప్రతిపాదించగా దేశం నలుమూలలనుంచి హాజరయిన దా దాపు వెయ్యి మంది పార్టీ ప్రతినిధులు దానికి ఆమోదముద్ర వేశారు. న్యూఢిల్లీలో ఈ నెల 19న జరిగిన పా ర్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఆ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేయడం కోసం ఈ రోజు జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పా టు చేశారు.