జాతీయ వార్తలు

బ్యాచిలర్లూ జిందాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారంతో బ్యాచిలర్ సిఎంల జాబితాలో చేరిపోయారు. 44 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ ఆధ్యాత్మిక గురువు. అలాగే అవివాహితుడు. శనివారం ఉత్తరాఖండ్ సిఎంగా ప్రమాణస్వీకారం చేసిన త్రివేంద్రసింగ్ రావత్(56), హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్(62), అస్సాం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్(54), డభ్బై ఏళ్ల ఒడిశా సిఎం నవీన్‌పట్నాయక్‌లు అవివాహితులే. ఆదిత్యనాథ్ కరుడుగట్టిన హిందుత్వవాది. దేశంలోనే పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌కు ఆయన మొదటి బ్యాచిలర్ సిఎం. వీరే కాదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(62) అవివాహితురాలే. బ్యాచిలర్ సిఎంల జాబితాలో బిజెపినే ముందుంది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ లాగే శనివారం ప్రమాణ స్వీకారం చేసిన రావత్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్. పశ్చిమ బెంగాల్‌లో మూడు దశాబ్దాలకు పైనే అధికారం చెలాయించిన వామక్షాలకు చెక్‌పెట్టి 2011లో తృణమూల్ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ మమత బెనర్జీ గద్దెనెక్కారు. మమత బెనర్జీ రెండో సారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసినందున కుటుంబ జీవితం గురించి ఆలోచించే తీరిక లేదని అనేక బహిరంగ సభల్లో మమతాబెనర్జీ ప్రకటించారు. జాతీయ నాయకుల్లో అనేక మంది ప్రముఖులూ బ్యాచిలర్సే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ(46), బిఎస్పీ అధినేత్రి మాయావతి(61), బిజెపి సీనియర్ నాయకురాలు ఉమాభారతి(57) అవివాహితులు. పలు సందర్భాల్లో వారే స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘నేను కింది కులానికి చెందినదాన్ని. పెళ్లి చేసుకోలేదు. నా జీవితం మీకే అంకితం’ అంటూ అనేక సభల్లో బిఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పుకుంటారు. 2000 సంవత్సంలో ఒడిశాలో అధికార పగ్గాలు చేపట్టిన నవీన్ పట్నాయక్ ‘నేను బ్యాచిలర్‌ను కాబట్టి కుటుంబ పాలనకు అవకాశమేలేదు. కాంగ్రెస్ పార్టీలా బిజెడిది కుటుంబ పాలన కాలదు. ప్రజలే నా కుటుంబం’అంటూ ప్రకటించుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కూడా ఎందుకు పెళ్లాడలేదో వివరణ ఇచ్చుకున్నారు. ఎన్నికల రంగంలో బిజీగా ఉన్నతాను ప్రైవేటు లైఫ్‌పై దృష్టిపెట్టడం లేదని చెప్పుకొచ్చారు. అయితే నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లాడతానని రాహుల్ అనేవారు. కాగా ఇటీవలే కన్నుమూసిన తమిళనాడు సిఎం జె జయలలిత కూడా అవివాహితురాలే!