జాతీయ వార్తలు

15రోజుల్లోనే జిపిఎఫ్ సొమ్ము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరింత ఊరట నిచ్చే రీతిలో జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జిపిఎఫ్) నిబంధనలను ప్రభుత్వం సడలించింది. వీటిని సరళీకరించడంతోపాటు మరింత సహేతుకంగా మార్చింది. ముఖ్యంగా ఉద్యోగులు తీసుకునే అడ్వాన్సులు, విత్‌డ్రావెల్స్‌కు సంబంధించి కనీసం 15 రోజుల వ్యవధిలోనే వారు కోరిన మొత్తాన్ని ఆమోదించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న జిపిఎఫ్ నిబంధనలు 1960లోనే అమలులోకి వచ్చాయని, ఇప్పటివరకూ కొన్ని సవరణలు చేసినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తదనుగుణమైన మార్పులను చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. ఈ మార్పుల వల్ల జిపిఎఫ్ రుణాలు తీసుకునే ప్రక్రియ మరింత సరళతరం అవుతుందని, అదే విధంగా ఇళ్ల నిర్మాణం, పిల్లల చదువులకు కూడా అడ్వాన్సులు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే అడ్వాన్సులు, విత్‌డ్రావెల్స్‌కు సంబంధించి డాక్యుమెంటరీ ప్రూఫ్ నిబంధనను తొలగించినట్లు తెలిపారు. కేవలం సదరు చందాదారు ఓ ప్రకటన ఇస్తే సరిపోతుందని, 15 రోజుల్లోనే రుణాల ఆమోదం, చెల్లింపు జరిగిపోతుందని తెలిపారు. ఇక అస్వస్థతకు సంబంధించి ఏడు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఉద్యోగులు ఉపసంహరించుకునే మొత్తాన్ని హౌసింగ్ లోన్ విషయంలో 90 శాతానికి పెంచామన్నారు. వాహనాలు లేదా కారు కొనుగోళ్లకు నాలుగింట మూడొంతుల మొత్తాన్ని అతని ఖాతాలో మిగిలిన మొత్తం నుంచి చెల్లిందుకు వీలుంటుందని చెప్పారు.