జాతీయ వార్తలు

ఆమోదమే తరువాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: దేశవ్యాప్తంగా సరికొత్త పరోక్ష పన్నుల విధానం జిఎస్‌టి అమలుకు మరింతగా మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన నాలుగు కీలక బిల్లులను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించటంతో పార్లమెంట్‌లో దీన్ని ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది.
జూలై 1నుంచి జి ఎస్టీ అమలయితే దేశ ఆర్థిక వృద్ధిరేటు మరో రెండుశాతం పెరుగగలదన్న ధీమా వ్యక్తమవుతోంది. ఈ బిల్లులో భాగంగా జి ఎస్టీ అమలయ్యే మొదటి అయిదేళ్ల పాటు రాష్ట్రాలు కోల్పోయే రెవిన్యూను కేంద్రం భర్తీ చేస్తుంది. ఈ వారంలోనే జీ ఎస్టీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్లమెంట్ ఆమోదంతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం కూడా తోడైతే ఒకే జాతి ఒకే పన్ను అన్న జీ ఎస్టీ విధానం అమల్లోకి వస్తుంది. ఎక్సైజ్ సుంకం, సేవా పన్నులు, అలాగే రాష్ట్రాలు విధించే వ్యాట్ అన్నీ కూడా జీ ఎస్టీ పరిధిలోకి వస్తాయి.