జాతీయ వార్తలు

బెంగాల్‌లో 65 ఏళ్ల తర్వాత ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 20: ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఎఐఎఫ్‌బి) 65ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పశ్చిమ బెంగాల్‌లో పార్టీ నూతన కార్యదర్శిని ఎన్నుకుంది. ఎఐఎఫ్‌బి సీనియర్ నాయకుడుడైన నరేన్ ఛటర్జీని పార్టీ రాష్ట్ర సమితి ఆదివారం ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నుకుంది. 1952 నుంచి ఎఐఎఫ్‌బి రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అశోక్ ఘోష్ మరణించడంతో ఈ పదవికి ఖాళీ ఏర్పడింది. రాష్ట్ర పార్టీ చీఫ్‌గా అత్యధిక కాలంపాటు సేవలు అందించిన అశోక్ ఘోష్ (95) వృద్ధాప్య సమస్యలతో గత ఏడాది కన్నుమూయడంతో ఆయన స్థానంలో నరేన్ ఛటర్జీని ఎన్నుకున్నారు. రాష్ట్రంలో ఫార్వర్డ్ బ్లాక్‌తోపాటు వామపక్షాలు కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, పార్టీతోపాటు వామపక్షాల ఐక్యతను బలోపేతం చేయడమే తన ఏకైక ధ్యేయమని నరేన్ ఛటర్జీ స్పష్టం చేశారు. ఎఐఎఫ్‌బికి ఎనలేని సేవలందించిన అశోక్ ఘోష్ అడుగుజాడల్లో పయనించి పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.