జాతీయ వార్తలు

ఏ క్షణమైనా పిలుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21:పార్లమెంట్‌కు గైర్హాజరు కావడం పట్ల పార్టీ ఎంపీలను ప్రధాని మోదీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఇటీవల కాలంలో కనీస పక్షంగా సభలో కోరం కూడా లేని సంఘటనలు చోటుచేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మంగళవారం మాట్లాడిన మోదీ ప్రతి ఒక్కరి హాజరీపై తాను దృష్టి పెడతానని చెప్పారు. ‘నేను ఏ క్షణంలోనైనా ఎవర్నయినా పిలువచ్చు..’నంటూ బలమైన సందేశానే్న అందించారు. పార్లమెంటరీ కార్యకలాపాలు సాగాలంటే కనీస పక్షంగా సభ్యులు ఉభయ సభల్లోనూ ఉండి తీరాలి. ఇటీవలి కాలంలో కనీస సభ్యులు కూడా లేకపోవడం వల్ల సభా కార్యకలాపాల్లో జాప్యం జరిగిన సందర్భాలు ఎన్నో ఉండటాన్ని మోదీ తన ప్రసంగంలో పరోక్షంగా ప్రస్తావించారు. పార్లమెంట్‌కు హాజరు కావడం అన్నది ఎంపీల బాధ్యత అని పేర్కొన్న మోదీ ఇందుకోసం ఎవర్నీ ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం ఉండదని తెగేసి చెప్పారు. ‘నేను ఎన్నో చేయగలను..కానీ మీ అందరి తరపున పార్లమెంట్‌కు హాజరు కాలేను కదా..’అంటూ చురక వేశారు. సోమవారం, మంగళవారం ఉభయ సభల్లో కనీస పక్షంగా కూడా సభ్యులు లేని విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత కుమార్ ప్రస్తావించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఉన్నామంటే సరిపోదని, సభ్యులు సభల్లో ఉండటమే ముఖ్యమని కూడా మోదీ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పార్టీ ఎంపీలు పార్లమెంట్‌కు హాజరు కాకపోవడం పట్ల మోదీ తీవ్ర అసహనంతో ఉన్నారని, అందుకే ‘ఎప్పుడైనా ఎవర్నయినా పిలుస్తా..’నంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా ఓ ఎంపీ తెలిపారు. సభకు రావాల్సిందేనని గతంలో కూడా సభ్యులకు మోదీ స్పష్టం చేసినప్పటికీ ఈ సారి మాత్రం ఆయన స్వర తీవ్రత మరింతగా పెరిగింది.

చిత్రం..బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరవుతున్న ప్రధాని నరేంద్ర మోదీ