జాతీయ వార్తలు

‘నారద’ కేసులో బెంగాల్ సర్కార్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చుక్కెదురైంది.
కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముడుపులు తీసుకుంటూ వీడియో కెమెరాకు చిక్కిన ఈ కేసుపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు బలపరిచింది. హైకోర్టు ఉత్తర్వుపై మమతా బెనర్జీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు దురదృష్టకరమైనవిగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రధాని న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. హైకోర్టు తీసుకున్న నిర్ణయం అన్ని విధాలుగా సమర్థనీయమేనని వ్యాఖ్యానించింది. అలాగే ఇందుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ దాఖలుకు ఇచ్చిన 72 రోజుల గడువును నెల రోజులకు పెంచింది.