జాతీయ వార్తలు

గోరఖ్‌పూర్‌లో పండుగ వాతావరణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోరఖ్‌పూర్, మార్చి 21: యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటినుంచి లక్నోలోని అధికార కేంద్రానికి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాత్రాస్థలమైన గోరఖ్‌పూర్‌లో పండుగ వాతావరణం కనిపిస్తోంది.
పట్టణంలోని సివిల్ లైన్స్ మొదలుకొని ఘంటా ఘర్ దాకా కూడా ‘యోగి- యోగి’ అనే నినాదాలు తరచూ వినిపిస్తూ ఉండగా, గోరఖ్‌నాథ్ ఆలయం పక్కనుంచి వెళ్లేవారికి లడ్డూలు పంచడం కోసం ఆదిత్యనాథ్ మద్దతుదారులు పోటీ పడుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆలయం ఆవరణలో మరిన్ని సిసిటీవీలను ఏర్పాటు చేయనున్నట్లు రెండు రోజుల క్రితం ఆలయ అధికారులు చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ యుపి ముఖ్యమంత్రి పదవికి ఎంపిక కావడంతో తూర్పు యుపీలో సంప్రదాయ వంటకం అయిన ‘బాటి- చోఖా’ వ్యాపారులు సైతం ఆనందంతో పొంగిపోతున్నారు. ఇకపై తమ వంటకం పశ్చిమ యుపీలోని జనం ఆహారపు అలవాట్లలో ఒకటిగా మారిపోతుందని వారంతా భావిస్తున్నారు.
తెల్లవారుజామున 3 గంటలకే..
నిరాడంబరమైన బ్రహ్మచారి జీవితం గడిపే యోగి ఆదిత్యనాథ్ కచ్చితమైన దినచర్యను పాటిస్తారు. ఆదిత్యనాథ్ ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేస్తారని, నాలుగునుంచి 5 గంటల వరకు యోగా చేస్తారని 12 ఏళ్లకు పైగా ఆదిత్యనాథ్‌గురించి బాగా తెలిసిన సీతాపూర్‌లోని నైమిశారణ్య ఆశ్రమానికి చెందిన స్వామి విద్యాచేతన్ మహరాజ్ అంటున్నారు.
యోగా తర్వాత ఆయన ప్రార్థన చేసి మఠం, ఆలయం అంతా ఒకసారి తిరిగి పరిశుభ్రతను స్వయంగా తనిఖీ చేస్తారని చెప్పారు. ఆ తర్వాత చేపలకు ఆహారం వేసాక గోశాలకు వెళ్తారు. అక్కడ ఉండే ప్రతి ఆవుకు ఆదిత్యనాథ్ స్వయంగా ఒక్కో పేరు పెట్టారు. అక్కడి గోవులకు స్వయంగా తన చేతులతో పశుగ్రాసం అందిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక మఠాధిపతిగానే కాక గోరఖ్‌నాథ్ ఎంపీగా ఉన్నందున ఆయన తన కార్యాలయానికి వెళ్లి ప్రజల ఫిర్యాదులు వింటారు. సాధారణంగా అయితే ఉదయం 9నుంచి 11 గంటల దాకా ఆయన కార్యాలయంలో ఉంటారు. ఒకవేళ ఫిర్యాదులు గనుక ఎక్కువగా ఉంటే చివరి ఫిర్యాదు వినేదాకా అక్కడే ఉంటారని మహరాజ్ చెప్పారు.
ఇక ఆదిత్యనాథ్ ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే ఉదయంపూట సాధారణంగా ఆయన ఉడికించిన గింజలు, బొప్పాయి, మజ్జిగ తేట, ఆపిల్, ఓట్‌మీల్ (దాలియా) తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనంలో ఒక చపాతి, పప్పు, ఉడికించిన కూరగాయలు తీసుకుంటారు. ఒకవేళ మధ్యాహ్నం భోజనం తీసుకోకపోతే డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. ఇక రాత్రి భోజనంలో రెండు చపాతీలు, పప్పు, పచ్చి కూరగాయలు తీసుకుంటారు. ఒకవేళ రాత్రి భోజనం తీసుకోకపోతే ఒక ఆపిల్ తిని రాత్రి 11 గంటలకల్లా నిద్రపోతారని మహరాజ్ చెప్పారు.

చిత్రం..ఆనందాన్ని పంచుకుంటున్న కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆదిత్యనాథ్