జాతీయ వార్తలు

నిపుణుల అభిప్రాయాల కోసం ‘నమో’ యాప్‌లో ప్రత్యేక విభాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: తమ ప్రభుత్వ విధానాలు, చేపట్టే కార్యక్రమాలపై వివిధ వర్గాలనుంచి అభిప్రాయాలు, సలహాలు స్వీకరించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ‘నమో’ పేరుతో సొంతంగా ఒక యాప్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా పేరొందిన విధానకర్తలు, విశే్లషకులు తమ అభిప్రాయాలు తెలియజేస్తూ వ్యాసాలు రాయడానికి ఆయన తన యాప్‌పై ఒక ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. ‘రిఫ్లెక్షన్’ పేరుతో ప్రారంభించిన ఈ విభాగం తాజా పరిణామాలపై వివిధ వర్గాలు ఏమనుకొంటున్నాయో తెలుసుకోవడానికి చేసిన ఒక ప్రయత్నిమని చెప్పవచ్చు. ప్రధాని ఇప్పటికే ప్రతినెలా రేడియోలో ప్రసారమయ్యే తన ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం, అలాగే తన ప్రభుత్వం పని తీరుపై ప్రారంభించిన ‘మై గవ్ యాప్’లపై సలహాలు, ఆలోచనలను ఆహ్వానిస్తూ ఉన్న విషయం తెలిసిందే. దేశంలో ప్రభుత్వ విధానాలపై చర్చకు ఒక కొత్త స్వరూపాన్ని కల్పించగల శక్తి ఈ ‘రిఫ్లెక్షన్’కు ఉందని బిజెపి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ భాగం చీఫ్ అమిత్ మాలవీయ అభిప్రాయపడ్డారు.