జాతీయ వార్తలు

అసలు సమస్య పిఓకె, గిల్గిత్‌ల ఆక్రమణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: జమ్మూ, కాశ్మీర్‌కు సంబంధించి భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఏకైక వివాదాంశం పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్‌లను పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడమేనని భారత ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. ఈ ప్రాంతాలనుంచి పాకిస్తాన్ ఖాళీ చేసి తీరాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ డే సందర్భంగా గురువారం ఇక్కడి పాక్ హైకమిషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మన దేశంలో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాశ్మీరీల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని బాసిత్ ఆ కార్యక్రమంలో అన్నారు. ‘జమ్మూ, కాశ్మీర్‌పై భారత్-పాక్‌ల మధ్య ఇప్పుడు ఏదయినా వివాదం ఉందంటే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్-బాల్టిస్తాన్‌లను పాక్ అక్రమంగా ఆక్రమించుకోవడమే. పాక్ ఆక్రమణనుంచి వీటిని ఎలా విముక్తం చేయాలి, భారత రిపబ్లిక్‌లో భాగం చేయాలనేది ఒక్కటే ఇప్పుడు సమస్య’ అని పార్లమెంటు భవనం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ సింగ్ చెప్పారు. భారత దేశ వైఖరి చాలా సంవత్సరాలుగా సుస్పష్టమని, 1994లో పార్లమెంటులో ఈ అంశంపై ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందని, అన్ని పార్టీలు దానికి మద్దతు ఇచ్చాయని కూడా సింగ్ చెప్పారు.
కాగా, కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలను తాత్కాలికంగా అణగదొక్కవచ్చు కానీ, వాటిని పూర్తిగా నాశనం చేయజాలరని బాసిత్ అన్నారు. అల్లా దయ వల్ల కాశ్మీర్‌లు జరుపుతున్న పోరాటం విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందని కూడా ఆయన చెప్పుకొన్నారు. కాశ్మీరీ ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని పాక్ భావిస్తోందని చెప్పారు. ఆసియాలో శాంతిని, పొరుగుదేశాలన్నిటితోను, స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామని చెప్పిన ఆయన అయితే ఇది సమాన స్థాయిలో ఉండాలని అన్నారు. తమ ప్రయత్నాలన్నీ కూడా ఈ దిశగానే ఉంటాయని చెప్పారు. అనంతరం మీరు అన్న ‘కాశ్మీరీల ఆకాంక్షల మాటలకు అర్థం ఏమి’టని విలేఖరులు బాసిత్‌ను అడగ్గా, ‘కాశ్మీరీలు ఏం కోరుకుంటుంటే అది’ అని ఆయన అన్నారు.