జాతీయ వార్తలు

కృష్ణా ట్రిబ్యునల్ విచారణ మే 4కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీకి ఉద్దేశించిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ మే 4, 5 తేదీలకు వాయి దాపడింది. ఏపీ, తెలంగాణ వాదనలు ప్రారంభించడానికి ముందు వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా సమర్పించేందుకు ఏప్రిల్ 13 వరకు ట్రిబ్యునల్ గడువిచ్చింది. అనంతరం కౌంటర్ల దాఖలుకు ఏప్రిల్ 27 వరకు ట్రిబ్యునల్ సమయం ఇచ్చింది. వాటిపై రిజయిండర్స్ దాఖలు చేసేందుకు మే 2 వరకు రెండు రాష్ట్రాలకు గడువు ఇచ్చింది. రిజయిండర్స్ అందిన తర్వాత మే 4, 5 తేదీల్లో విచారణ చేపట్టనున్నట్టు ట్రిబ్యునల్ తెలిపింది. గురువారం విచారణ ప్రారంభించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సమర్పించేందుకు సమయం కావాలని రెండు తెలుగు రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి. అయితే కేంద్రం తరపున న్యాయవాది వాదనలు కొనసాగిస్తూ గడువును పొడిగించవద్దంటూ ట్రిబ్యునల్‌ను కోరారు. అలాగే త్వరగా విచారణ జరిపి నీటి పంపకాలు జరపాలని ట్రిబ్యునల్‌ను కేంద్ర తరపు న్యాయవాది కోరారు. ఈ వాదనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ట్రిబ్యునల్ తప్పుబట్టింది. కేంద్ర వైఖరి తెలియజేసే అంశాన్ని అఫిడవిట్ రూపంలో ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ట్రిబ్యునల్ హెచ్చరించింది. అనంతరం తదుపరి విచారణను మే 4, 5 తేదీలకు వాయిదా వేసింది.