జాతీయ వార్తలు

ఏపీలో కలిపిన గిరిజనుల ప్రయోజనాలను కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాలలోని అరవై వేల మంది గిరిజనుల ప్రయోజనాలను కాపాడాలని తెలంగాణా రాష్ట్ర సమితి సభ్యుడు ఎఎస్‌ఆర్ నాయక్ కేంద్ర ప్రభుత్వానికి విజప్తి చేశారు. నాయక్ గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ అరవై వేల మంది గిరిజనుల పార్లమెంటు సభ్యుడు ఎవరు, శాసనసభ్యుడు ఎవరు? అనేది చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అరవై వేల మంది గిరిజనులకు ప్రాతినిథ్యం లేకుండాపోయింది, వారి గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అయినా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా అని నాయక్ కేంద్రాన్ని అడిగారు. ఈ అరవై వేల మంది గిరిజనులువ తనకు ఓటు వేసి గెలిపించారు, అయితే వీరినిప్పుడు ఏపీలో కలిపి వేయటంతో వారికి ప్రాతినిథ్యం లేకుండాపోయిందని ఆయన చెప్పారు. పోలవరం ముంపు పేరుతో వీరిని ఏపీలో కలిపారు, అయితే ముంపునకు గురికాని పంచాయితీలను కూడా ఏపీలో ఎందుకు విలీనం చేశారని ఆయన నిలదీశారు.