జాతీయ వార్తలు

కర్మాగారాల్లో ప్రమాదాలు తగ్గిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: కర్మాగారాల్లో ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రమాదాలను అదుపుచేసేందుకు కర్మాగారాల చట్టాన్ని సవరించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని సోమవారం ఇక్కడ వెల్లడించారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక ప్రశ్నకు బదులిస్తూ కార్మికుల పని స్థితిగతులు, ఆరోగ్యం, భద్రత కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 2012లో 1, 383 ప్రమాదాలు జరిగినట్టు తెలిపారు. 2013-14లో ప్రమాదాల సంఖ్య 1, 217కు తగ్గిందని దత్తాత్రేయ చెప్పారు. 2014 మరింత తగ్గాయన్నారు.గనుల్లో ప్రమాదాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామంటూ తెలంగాణలో సింగరేణిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు భారీగా నష్టపరిహారం చెల్లించామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలు కార్యక్రమాలను ప్రకటించారని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌వివై పథకం కింద చెల్లించే మొత్తాన్ని 40 వేల నుంచి లక్ష రూపాయలకు పెంచిన విషయాన్ని దత్తాత్రేయ గుర్తు చేశారు. టిడిపి సభ్యుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అసంఘటిత కార్మికులకు ఆరోగ్య, సామాజిక భద్రత సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.