జాతీయ వార్తలు

కులం, మతం ఆధారంగా బిజెపి వివక్ష చూపించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: భారతీయ జనతా పార్టీ కులం, మతం ఆధారంగా వివక్ష చూపించదని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో కొన్ని వర్గాలవారు వివక్షను ఎదుర్కొంటున్నారంటూ లోక్‌సభలో కొంతమంది సభ్యులు చేసిన ఆరోపణలను తోసిపుచ్చు తూ హోం మంత్రి ఈ విషయం చెప్పా రు. ఉత్తరప్రదేశ్‌లో ‘యాంటీ రోమి యో’ బృందాలను ఏర్పాటు చేయడంపై లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యురాలు రంజీత్ రంజన్ ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత హోం మంత్రి ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఈవ్‌టీజింగ్ సంఘటనలపై నిఘా పెట్టి ఉంచడానికి యుపి ప్రభుత్వం పోలీసు శాఖలో యాంటీ రోమియో స్క్వాడ్‌లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీరోఅవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన రంజీత్ రంజన్ ప్రేమలో పడడం తప్పా? అని ప్రశ్నించారు. అంతేకాదు, బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ ఉండడం తప్పా అని కూడా ఆమె ప్రశ్నించారు. యాంటీ రోమియో బృందాలను ఆమె ఎద్దేవా చేస్తూ ప్రభుత్వం పార్కుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా కూర్చోవాలో చెప్తోందా? అని అన్నా రు. దీనిపై యుపి ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన రాజ్‌నాథ్ స్పందిస్తూ ‘బిజెపి కులం, మతం ఆధారంగా వివక్ష చూపించదు’ అని అన్నారు. యుపిలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్దిరోజులే అయిందని ఆయన అంటూ, యాంటీరోమియో స్క్వాడ్‌లు ఎవరినైనా అనవసరంగా వేధింపులకు గురి చేసినట్లు ఉంటే ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’పై ప్రధానంగా దృష్టిపెడుతుందని యుపి ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ చెప్పారని కూడా రాజ్‌నాథ్ తెలిపారు.

చిత్రం.. లోక్‌సభలో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్