జాతీయ వార్తలు

విద్యా రంగానికి మరిన్ని నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మార్చి 24: విద్యా రంగానికి సాధారణ పరిస్థితుల్లో వెచ్చించే నిధుల కంటే మరిన్ని నిధులు వెచ్చించే విషయంపై దృష్టి సారించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు సూచించారు. ‘బిహార్ అండ్ జార్ఖండ్: షేర్డ్ హిస్టరీ టు షేర్డ్ విజన్’ అనే అంశంపై శుక్రవారం ఇక్కడ ఆసియా డెవలప్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ప్రణబ్ ఈ సూచన చేశారు. అభివృద్ధి విషయంలో ప్రస్తుతం ఎదురవుతున్న అన్ని సమస్యలు సాంకేతిక, నిర్వహణాపరమైన పరిష్కారాలకు అంత సులభంగా లొంగవని ఆయన ఉద్ఘాటించారు. గత శతాబ్దం మధ్యలో స్వాతంత్య్రాన్ని పొందింన చాలా వర్థమాన దేశాల్లో ప్రభుత్వ సంస్థల పాత్రను చాలా విస్తారమైనదిగానూ, ప్రభుత్వేతర సంస్థల పాత్రను చాలా పరిమితమైనదిగానూ పరిగణిస్తున్నారని, అయితే ఇటువంటి ప్రభుత్వేతర సంస్థలు లేదా పౌర సమాజ సంస్థల పాత్ర తక్కువగా ఉన్న చోట అభివృద్ధి ప్రక్రియలో ప్రభుత్వ సంస్థల సామర్థ్యం చాలా పరిమితంగా ఉంటుందని, ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులున్న ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక వ్యూహం అవసరమని అంతర్జాతీయ అనుభవాలు స్పష్టం చేస్తున్నాయని ప్రణబ్ పేర్కొన్నారు. ఇటువంటి ప్రాంతాలు కేవలం గతంలో అభివృద్ధి చెందిన ప్రాంతాలు లేదా దేశాల మాదిరిగా కేవలం పారిశ్రామికీకరణ పథంలో పయనించడమే కాకుండా ఆర్థిక ఉత్పాదక శక్తులకు ఊతమిచ్చే అభివృద్ధి వ్యూహాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్న విషయాన్ని గుర్తించాలని రాష్టప్రతి స్పష్టం చేశారు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం పెరగడంతో ఇప్పటివరకూ రాజకీయంగా నిరాదరణకు గురైన వర్గాలకు అధికారం లభించిందని, దీంతో అభివృద్ధిపై ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ఉన్నాయని ప్రణబ్ తెలిపారు.

చిత్రం..అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్