జాతీయ వార్తలు

బ్రహ్మకుమారీల సేవ నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: భారతీయ సంస్కృతిని, దాని ఔన్నతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత బ్రహ్మకుమారీలదేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. బ్రహ్మకుమారి సమాజం 80వ వార్షికోత్సవ సందర్భంగా వీడియో ప్రసంగం చేసిన ఆయన దీని సేవలను శ్లాఘించారు. సౌర ఇంధన వినియోగాన్ని విస్తృతం చేసిన ఘనత కూడా బ్రహ్మకుమారీలదేనని తెలిపారు. శిలాజేతర ఇంధనాల ద్వారా 40శాతం ఇంధనాన్ని రానున్న పదమూడేళ్ల కాలంలో ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో భారత్ కృషి చేస్తోందన్నారు. రానున్న అయిదేళ్ల కాలంలో 175 మెగావాట్ల మేర స్వచ్ఛ ఇంధనోత్పత్తే భారత లక్ష్యంగా తెలిపారు. ఈ రకమైన ఇంధన వినియోగాన్ని పెంపొందించటంలో బ్రహ్మకుమారీల కుటుంబం మరింత తోడ్పాటునందించాలన్నారు. దేశంలో పౌష్టికాహార కల్పన, మహిళల సాధికారికత అంశాలను ప్రస్తావించిన మోదీ, అందరికీ పౌష్టికాహారం అందేలా సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ప్రసూతి చట్టాన్ని ఇందుకు అనుగుణంగా సవరించిందని, దీనివల్ల బాలింతలకు 26 వారాల సెలవు దొరుకుతుందన్నారు. హిందువులు, ముస్లింలు, పార్శీలు అందరికీ దేవుడు ఒక్కడేనని మోదీ స్పష్టం చేశారు. ఎవరు ఏ రూపంలో పూజించినా దేవుడు ఒక్కడేనన్నది భారతీయ భావన అని తెలిపారు. ఎవరిపైనా తమ అభిప్రాయాలను రుద్దే స్వభావం భారత్‌ది కాదని, విజ్ఞానానికి సరిహద్దులు లేవన్నదే తమ బలమైన నమ్మకం అని తెలిపారు. విజ్ఞానానికి వీసా అవసరం లేదంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.