జాతీయ వార్తలు

దినకరన్ కేసు వాయిదాకు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 27: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనపై మోపిన రెండు ఆర్థిక నేరాల కేసుల విచారణను వాయిదా వేయాలంటూ అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ దాఖలు చేసిన అప్పీల్‌ను ఆర్థిక నేరాల కోర్టు తిరస్కరించింది. ఏప్రిల్ 12న తాను పోటీ చేస్తున్న ఆర్కె నగర్ ఉప ఎన్నిక జరగనున్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు కేసుల విచారణను వాయిదా వేయాలని దినకరన్ కోరారు. 1994లో దినకరన్‌పై దేశ ఆర్థిక నేరాల చట్టాలను ఉల్లంఘించారంటూ ఈడి కేసు నమోదు చేసింది. ఈ పిటిషన్‌పై రోజూవారి విచారణ జరిపించాలని ఈడి న్యాయవాది ఆర్థిక నేరాల న్యాయస్థానంలో జస్టిస్ మలార్‌మథిని కోరారు. ఉప ఎన్నికలకు కేసుల విచారణకు సంబంధం లేదని న్యాయవాది స్పష్టం చేశారు. 2015లో ఈ కేసుల నుంచి ఆర్థిక నేరాల కోర్టు నిర్దోషిగా విడుదల చేసినా ఈడీ మద్రాస్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేయటంతో మళ్లీ విచారణ మొదలైంది. బార్కలేస్ బ్యాంక్ ద్వారా డిప్పర్ ఇనె్వస్ట్‌మెంట్ సంస్థకు 1.04కోట్ల డాలర్లను మళ్లించారని, వెస్ట్‌బ్యాంక్ నుంచి 44.37లక్షల పౌండ్లను బదిలీచేశారని ఆరోపణలున్నాయి.