జాతీయ వార్తలు

బనారస్ వర్శిటీపై నిషేధం లేదు: కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: బనారస్ హిందూ యూనివర్శిటీపై ఎలాంటి నిషేధం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో స్పష్టం చేసింది. వర్శిటీపై ఆంక్షలు విధించారంటూ వచ్చిన ఆరోపణలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పందించారు. బనారస్ హిందూ యూనివర్శిటీలో విద్యార్థినులు వివక్షకు గురవుతున్నారన్న ఆరోపణలపై ఆయన ఒక ప్రకటన చేశారు. యూనివర్శిటీలో ఎలాంటి ఆంక్షలు కానీ, నిషేధం కానీ లేదని, అంతర్జాతీయంగా ర్యాంకులు వచ్చేందుకు భారతీయ విద్యాసంస్థల్లో అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ ఫ్యాకల్టీలు ఎక్కువగా వస్తున్నందున మరింతగా ప్రస్తుత పరిస్థితిలో మరింత మార్పు వస్తుందని ఆయన అన్నారు. విద్యాబోధన వనరులు, పరిశోధన, వృత్తిపరమైన అధ్యయనం తదితర అంశాల ఆధారంగా జాతీయ విద్యా ర్యాంకింగ్ ఫ్రేంవర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) ఆయా సంస్థలకు ర్యాంకులనిస్తుందని జవదేకర్ అన్నారు.