జాతీయ వార్తలు

బెంగాల్ సిపిఎంకు వింత చిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మార్చి 28: మూడు దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్‌లో అవిచ్ఛిన్నంగా అధికారంలో కొనసాగిన సిపిఎం పార్టీకి ఇప్పుడు అధికారం దూరమవడం అటుంచి అసెంబ్లీలో బలం బాగా తగ్గిపోయి సొంతంగా ఒక రాజ్యసభ సభ్యుడిని గెలుపించుకోలేని వింత స్థితి ఎదురవుతోంది. పార్టీ వైఖరికి భిన్నంగా సైద్ధాంతక శత్రువైన కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరాల్సి రావడం దయనీయమే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్‌కు 22 మంది ఎమ్మెల్యేలుండగా, కాంగ్రెస్ పార్టీకి 44 మంది, అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు 211 మంది శాసన సభ్యులున్నారు. అయిదుగురు కాంగ్రెస్ సభ్యులు, ఒక లెఫ్ట్ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్‌లో చేరినప్పటికీ వారు ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా తమ మాతృపక్షాలకు రాజీనామా చేయలేదు.
ఈ ఏడాది మధ్యలో పశ్చిమ బెంగాల్‌నుంచి కొంతమంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వారిలో ఒకరు. అసెంబ్లీలో బలం తగ్గిపోయిన కారణంగా సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ సొంతంగా రాజ్యసభకు ఒక్క సభ్యుడిని కూడా పంపించడం అసాధ్యంగా మారింది. తమ అభ్యర్థిని గెలుపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని కానీ, తృణమూల్ కాంగ్రెస్‌ను కానీ మద్దతు కోరాల్సిన అవసరం ఉంది. తమ అభ్యర్థి గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరడమంటే అది ఇనే్నళ్లుగా పార్టీ అనుసరిస్తూ వస్తున్న వైఖరికి వ్యతిరేకమే. అయితే ఎన్నికలు జరిగేది జూలైలోనని, తాము ఇప్పటివరకు ఈ విషయమై చర్చించలేదని, తగిన సమయంలో దానిపై ఆలోచిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సూర్యకాంత మిశ్రా పిటిఐతో అన్నారు. టిఎంసి మద్దతు కోరడమనే ప్రశే్న ఉత్పన్నం కాదని, అందువల్ల కాంగ్రెస్ సాయం కోరడమొక్కటే మిగిలి ఉన్న మార్గమని, త్వరలో జరగబోయే రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడొకరు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి పరాజయం పాలయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు, అవగాహన పెట్టుకోకూడదన్న పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయానికి భిన్నంగా పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితి తలెత్తిందని గత ఏడాది మేలో సిపిఎం పొలిట్ బ్యూరో వ్యాఖ్యానించడం తెలిసిందే.