జాతీయ వార్తలు

‘ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేలా చూడాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విజప్తి చేశారు. గురువారం వెంకయ్యను కలిసిన కృష్ణ మాదిగ ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. తెలంగాణలో ఈ ఏడాదే లక్ష ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుపడుతోందని, ఏపీ ప్రభుత్వం 25వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న తరుణంలో వర్గీకరణ జరగకపోతే మాదిగ ఉప కులాలకు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదముందని ఆయన వివరించారు. భారీగా ఉద్యోగాల భర్తీ జరిగితే మళ్లీ పదేళ్లదాకా ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉండదని ఆయన తెలిపారు.