జాతీయ వార్తలు

ప్రతిదీ విద్వేష దాడి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: అమెరికాలో భారతీయులపై జరిగే ప్రతి దాడీ లేదా మరణాన్ని విద్వేష దాడిగా కానీ, విద్వేష నేరంగా కానీ పరిగణించలేమని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. విదేశాల్లో భారతీయులపై జరుగుతున్న దాడుల గురించి గురువారం రాజ్యసభలో సభ్యులు వ్యక్తం చేసిన అందోళనపై ఆమె స్పందించారు. ‘కాన్సాస్‌లో కూచిభొట్ల శ్రీనివాస్ హత్య జరిగిన మర్నాడు నిందితుడిని అరెస్టు చేశారు. కానీ దీప్‌రాయ్ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. హర్నీష్ పటేల్‌పై జరిగిన దాడి ఒక దోపిడీకి సంబంధించిందిగా తెలుస్తోంది’ అని సుష్మా పేర్కొన్నారు.