జాతీయ వార్తలు

పిఎంఎవై కింద 16,42,685 ఇళ్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: దేశ వ్యాప్తంగా 2017 మార్చి 20 నాటికి ప్రధాన్ మంత్రి అవాస్ యోజన-అర్బన్ (పిఎంఎవై, అర్బన్) కింద 82,048 ఇళ్లు నిర్మించినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 62,312 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించినట్టు రాజ్యసభకు తెలిపారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో పిఎంఎవై పథకంపై ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. 2022 నాటికి అందిరికీ ఇళ్ల హామీ ఏమైందని విపక్షం అడిగింది. ఇప్పటివరకూ పిఎంఎవై కింద 16,42,685 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో రాజీవ్ అవాస్ యోజన ఇళ్లూ ఉన్నాయని ప్రణాళిక మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ వెల్లడించారు. ఇళ్ల పథకం అమలులో ఉత్తరప్రదేశ్ వెనకబడి ఉందని ఆయన అన్నారు. మొత్తం 82,048 ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం వివరాలు అందజేసింది. గుజరాత్‌లో 25,873, కర్నాటకలో 10,447, రాజస్థాన్‌లో 10,805, తమిళనాడులో 6,490, మహారాష్టల్రో 5,506 ఇళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. యూపీలో 3,822 ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నట్టు సింగ్ చెప్పారు.