జాతీయ వార్తలు

అది మా బాధ్యత కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: కరువుప్రాంతాలకు ఏ మేరకు నీరు కేటాయించాలనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిర్ణయించుకోవాలి తప్ప కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి సంజయ్ బలియాన్ స్పష్టం చేశారు. వైకాపా సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో అడిగిన ప్రధాన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిస్తూ కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన నీటిని రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి ఎంత ఇవ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించటం సాధ్యం కాదని, ఈ బాధ్యత సంబంధిత రాష్ట్రాలదేనని స్పష్టం చేశారు. అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కరవు తీవ్రంగా ఉందని, గాలేరు-నగరి సుజల స్రవంతి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నికర జలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారని మంత్రికి వివరించారు. కరవు నెలకొన్న జిల్లాల్లోని ఐడి పంటలకు నికర జలాలు కేటాయించాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నాయకత్వంలోని ట్రిబ్యునల్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు ఆర్డినెన్సును జారీచేయాలని సూచించారు. దీనికి మంత్రి సమాధానం చెబుతూ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి ఎంత నీరు ఇవ్వాలి, ఎవరికి ఎంత కేటాయించాలనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలని, రెండు తెలుగు రాష్ట్రాలు తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవాలని అన్నారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చినప్పుడు ఒక టిఎంసి నీటితో 6,500 ఎకరాలను సాగు చేయవచ్చునని అంచనా వేశారని, అయితే ఆధునిక విజ్ఞానం ఆధారంగా ఒక టిఎంసి జలాలతో పది, పదకొండు వేల ఎకరాల్లో ధాన్యం, పదిహేను నుండి పదహారు వేల ఎకరాల్లో ఐడి పంట పండించేందుకు అవకాశాలున్నందున దీని ప్రకారం ఆయా ప్రాజెక్టులకు నీటిని కేటాయించే విధంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి బలియాన్ స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా భారీ నీటిపారుదల ప్రాజెక్టులతోపాటు చిన్నతరహా నీటిపారుదల పథకాలకు కూడా నీరు కేటాయించటాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని బదులిచ్చారు.
కాగా, కృష్ణా జలాల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన పలు సమస్యలను ట్రిబ్యునల్‌కు ఎందుకు పంపించటం లేదని టిఆర్‌ఎస్ ఎంపీ బి వినోద్‌కుమార్ కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాల పంపిణీపై పలు అభ్యంతరాలను లేవనెత్తుతూ కేంద్రానికి లేఖ రాసిందని చెప్పారు. ఈ అంశాలను ట్రిబ్యునల్‌కు పంపిస్తారా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు పెన్నానది ఉన్నదని, కృష్ణానదీ జలాలను దాని పరిధిలోకి వచ్చే తమ రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వినోద్‌కుమార్ చేసిన ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు ఎంపీలు తీవ్రంగా ఖండించారు. ఈ ప్రతిపాదన తమకు ఎంతమాత్రం సమ్మతం కాదంటూ పెద్దఎత్తున కేకలు వేశారు. కృష్ణానది నుండి తెలంగాణకు రావలసినంత నీటిని కేటాయించలేదని వినోద్ ఆరోపించారు. కృష్ణా జలాలను ఏపి, తెలంగాణ, కర్నాటక, మహారాష్టల్ర మధ్య పంపిణీ చేయాలని, దీనికోసం కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వినోద్‌కుమార్ చేసిన ప్రతిపాదనను ఏపీ ఎంపీలు తీవ్రంగా ఖండించటంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొన్నది. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ మీరిలా ఎందుకు వాదించుకుంటున్నారని ఇరుపక్షాలను ప్రశ్నించారు. మీరిలా కొట్లాడుకుంటే కృష్ణా నది తన ప్రవాహగతిని మార్చుకునే ప్రమాదం ఉన్నదని నవ్వుతూ హెచ్చరించారు. గతంలో సరస్వతీ నది కూడా ఇలాగే మాయమైపోయిందని ఆమె అన్నారు. వినోద్‌కుమార్ ప్రతిపాదనకు సంజయ్ బలియాన్ బదులిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు బజాజ్ కమిటీని ఈ సంవత్సరం జనవరి 9న ఏర్పాటు చేశామని, ఈ కమిటీ మూడు నెలల్లో తమ నివేదికను కేంద్రానికి అందజేయవలసి ఉన్నదని చెప్పారు. టిఆర్‌ఎస్ పక్ష నాయకుడు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న పెద్ద ట్రిబ్యునల్‌కు ఈ అంశాన్ని అప్పగిస్తారా? అని అడిగారు. దీనికి మంత్రి సమాధానం ఇస్తూ కొత్త ట్రిబ్యునల్ పరిధిలో పలు బెంచీలు ఉంటాయని చెప్పారు తప్ప జితేందర్ రెడ్డి చేసి ప్రతిపాదన గురించి ప్రస్తావించలేదు.