జాతీయ వార్తలు

యువకుడికి శిరోముండనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాహజాన్‌పూర్, ఏప్రిల్ 1: దగ్గరుండి మరీ ఓ యువకుడికి శిరోముండనం చేయించిన ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఒక మహిళతో ఫోన్లో మాట్లాడుతున్నాడన్న కారణంతో యువకుడి కొందరు వ్యక్తులు బంధించారు. అంతే పోలీసుల సమక్షంలోనే యువకుడికి శిరోముండనం చేశారు. ఈనెల 22న సౌత్ సిటీ కాలనీలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువకుడిని అజీజ్‌గంజ్ పోలీసు స్టేషన్‌కు తీసుకురాగా స్థానికులు కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పైగా దీన్ని కానిస్టేబులే ఒకరు మొబైల్ ఫోన్‌లో చిత్రించాడు. అక్కడితో ఆగకుండా స్నేహితులకు వాట్సప్‌లో పంపడంతో వెలుగుచూసిందని ఎస్‌పి కెవి సింగ్ వెల్లడించారు.