జాతీయ వార్తలు

రక్తపాతం ప్రగతికి శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉధంపూర్, ఏప్రిల్ 2: అభివృద్ధిలో జమ్ము,కాశ్మీర్‌ను కొత్త పుంతలు తొక్కిస్తామని, రాష్ట్ర సమగ్ర ప్రగతి విషయంలో ఎవరూ తమను ఆపలేరని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నాలుగు దశాబ్దాల పాటు రాష్ట్రంలో సాగిన రక్తపాతం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం కలుగలేదని స్పష్టం చేసిన మోదీ ‘ఉగ్రవాదాన్ని వీడి టూరిజాన్ని ఎంచుకోండి..రాష్ట్భ్రావృద్ధి, ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పాటుపడండి’అంటూ యువతకు పిలుపునిచ్చారు.ఈ నలభై సంవత్సరాల కాలాన్ని రాష్ట్ర ప్రజలు టూరిజం అభివృద్ధికి వినియోగించి ఉండి ఉంటే ఈ పాటికి కాశ్మీర్ ప్రపంచ స్థాయికి చేరుకునేదన్నారు. కాశ్మీరీతత్వం, ప్రజాస్వామ్యం,మానవత్వం అన్న మాజీ ప్రధాని వాజపేయి నినాదాన్ని ఉటంకించిన మోదీ కాశ్మీర్ సమగ్రాభివృద్ధికి ఇదే తమ ఆశయమన్నారు. కాశ్మీర్-జమ్ము మధ్య అతిపెద్ద సొరంగ రహదారి మార్గాన్ని ఆదివారం ఇక్కడ ఆవిష్కరించిన అనంతరం ఓ ర్యాలీలో మాట్లాడిన మోదీ ఉగ్రవాద ప్రేరణతో తప్పుదోవ పడుతున్న యువతకు బలమైన సందేశానే్న ఇచ్చారు. ‘మీరు విసిరే రాళ్లు వౌలిక సదుపాయాల నిర్మాణానికి ఉపయోగపడతాయి’అంటూ చురక వేశారు. సూఫీ సాంస్కృతిక సంప్రదాయాన్ని విస్పరిస్తే వర్తమానాన్ని కోల్పోవడమే కాదు భవిష్యత్‌ను కూడా అంధకారమయం చేసుకోవడమే అవుతుందని హెచ్చరించారు. కాశ్మీర్‌లో అల్లర్లను సృష్టించడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్‌ను పరోక్షంగా ప్రస్తావించిన మోదీ ‘తమనితాము సంరక్షించుకోవడమే వాళ్లకు తెలియదు’అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతామని పేర్కొన్న మోదీ ‘దీని వల్ల ఇతరుల ఆక్రమణలో ఉన్న ప్రాంతాల ప్రజలకు తాము ఎంతగా నష్టపోతున్నామో తెలుస్తుంది’అని అన్నారు.

చిత్రం.. అతిపెద్ద రహదారి సొరంగ మార్గాన్ని ఆదివారం కాశ్మీర్‌లో జాతికి అంకితం చేసిన అనంతరం దాన్ని పరిశీలిస్తున్న
ప్రధాని నరేంద్రమోదీ, ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్ ఓరా, కేంద్రమంత్రులు గడ్కరీ, జితేంద్రసింగ్