జాతీయ వార్తలు

125 కోట్ల మందికి అందించిన.. అమూల్యమైన కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ప్రయోగం ఇస్రో శాస్తవ్రేత్తలు సాధించిన ఘనమైన విజయమని, 125 కోట్ల దేశ ప్రజలకు వారు అందించిన అమూల్యమైన కానుక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కొత్త వ్యవస్థకు ‘నావిక్’ అని పేరుపెట్టిన ఆయన ‘నావిక్’ పూర్తి పేరును ‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెల్లేషన్’ అని వివరించారు. ఈ కొత్త వ్యవస్థను దేశ ప్రజలకు అంకితం చేసిన మోదీ దీని సేవలను సార్క్ దేశాలు కూడా వినియోగించుకోవచ్చని అన్నారు. ఇస్రో శాస్తవ్రేత్తలు.. సామాన్య ప్రజల అవసరాలు తీర్చేందుకు ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ ఫర్ ఇండియన్స్’ కలలను సాకారం చేశారని ప్రధాని కొనియాడారు. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ప్రయో గం తరువాత మోదీ టెలివిజన్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో సొంత జిపిఎస్, నావిగేషన్ వ్యవస్థలను కలిగి ఉన్న అయిదు దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచిందని అన్నారు. ‘ఈ రోజు భారత్ నావిగేషన్ రంగానికి సంబంధించి ఏడో ఉపగ్రహాన్ని ప్రయోగించింది. మొత్తం ఏడు ఉపగ్రహాలను ఒకదాని తరువాత ఒకదాన్ని విజయవంతంగా ప్రయోగించింది. భారతీయ శాస్తజ్ఞ్రులు 125 కోట్ల దేశ ప్రజలకు అమూల్యమైన కానుకను అందించారు’ అంటూ మోదీ ఇస్రో శాస్తవ్రేత్తల బృందాన్ని కొనియాడారు. ‘అంతరిక్ష పరిశోధనారంగంలో భారతీయ శాస్తవ్రేత్తలు నిరంతర కృషి, పరిశ్రమతో ఎన్నో విజయాలు సాధించారు. దేశం ఈ రోజు వాటి ఫలితాలను అనుభవిస్తోంది’ అని ఆయన అన్నారు.
ఎన్నో శతాబ్దాల క్రితమే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాకముందే నక్షత్రాల సంచారం, సూర్య, చంద్రుల వేగాన్ని అనుసరిస్తూ ఎంతో సాహసంతో తెలియని గమ్యస్థానాలకు చేరుకున్న భారతీయ పేద మత్స్యకారులకు నివాళిగా ఈ కొత్త వ్యవస్థకు ‘నావిక్’ అని పేరు పెట్టినట్లు ప్రధాని వివరించారు. ‘ఇప్పుడు మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పని చేయబోతున్నాం’ అని అన్నారు. ‘ప్రపంచానికి ఇది ‘నావిక్’గా తెలుస్తుంది. ఇది మన సొంత నావిక్. మన మొబైల్ ఫోన్లలో ఇదే ఉంటుంది. మనం ఉన్న ప్రదేశాన్ని సూచిస్తుంది. మనం వెళ్లాల్సిన పథాన్ని, గమ్యస్థానాన్ని తెలియజేస్తుంది’ అని ప్రధాని అన్నారు. 125 కోట్ల ప్రజలకు కొత్త నావిక్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

chitram

ఇస్రో చేపట్టిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ప్రయోగాన్ని ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి గురువారం నాడు తిలకిస్తున్న ప్రధాని మోదీ