జాతీయ వార్తలు

చర్చల ద్వారానే అయోధ్యకు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: వివాదాస్పద అయోధ్య అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అవసరమైన తోడ్పాటు అందిస్తుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని ఇరు వర్గాలు చర్చల ప్రక్రియ ద్వారానే నివృత్తి చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి ముందు అయోధ్యలో ఆలయ నిర్మాణంపై గట్టిగా వాదించిన ఆదిత్యనాధ్ ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచితూచి స్పందించారు. ఇరు వర్గాలు కూర్చుని చర్చల ద్వారానే అయోధ్య సమస్యను పరిష్కరించుకోవాలంటూ సుప్రీం కోర్టు చేసిన సూచనను బలపరిచారు. ఈ వివాదంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇరు వర్గాలు సంప్రదింపుల ప్రక్రియను పునఃప్రారంభించి సామరస్య పూర్వక వాతావరణంలో పరిష్కార మార్గాన్ని కనుగొనాలన్నారు. ఇందుకు అవసరమైన సహాయాన్ని ప్రభుత్వ పరంగా అందిస్తామని ఆదిత్యనాధ్ ఉద్ఘాటించారు.
అందరినీ మెప్పిస్తా
ఉత్తరప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజల మనసులను గెలుచుకుంటానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. తన కాషాయ వస్తధ్రారణను పలువురు తప్పుగా ప్రచారం చేశారని, చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సెక్యులరిజం పేరుతో భారతీయ సంప్రదాయాలను అవమాన పరుస్తున్నారని ఆయన విమర్శించారు. తన చుట్టూ అనేక కథనాలను అల్లారని అన్నారు. ఆర్ ఎస్ ఎస్ పత్రిక ఆర్గనైజర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘మా పనితీరుతో అన్ని వర్గాల ప్రజల మనసులను దోచుకుంటాం. సంతోషం, సౌభాగ్యం అందరికీ అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతాం’’ అని ఆయన అన్నారు. హిందుత్వ అతివాదిగా పేరున్న ఆదిత్యనాథ్ తాను పెద్ద పెద్ద పదవులను లేదా అధికారాన్ని అనుభవించటానికో రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. యుపిని అవినీతి రహితంగా చేయటం, గూండారాజ్‌ను నిర్మూలించటం తన ప్రాధాన్యాలన్నారు. తన పనితీరు ప్రభావం రెండు నెలల్లో కనిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. 14రోజుల్లో చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తామన్నారు. 90శాతం మంది ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలసపోకుండా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. ఆరు నెలల్లో ఆరు షుగర్ ఫ్యాక్టరీలు స్థాపిస్తామని ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు.