జాతీయ వార్తలు

ఎవరి జోక్యమూ సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: భారత్-పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా చేసిన తాజా ప్రయత్నాన్ని భారత్ తిరస్కరించింది. పాక్‌తో ఉన్న అన్ని సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని, ఈ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. అన్యదేశ జోక్యానికి ఆస్కారం లేకుండానే ఇరు దేశాల సమస్యలన్నీ ద్వైపాక్షికంగానే పరిష్కారం కావాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెగేసి చెప్పింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న కథనాల నేపథ్యంలో భారత ఈ నిర్వంద్వ ప్రకటన చేసింది. హింసా, ఉగ్రవాదానికి అతీతంగా శాంతియుత రీతిలోనే భారత్-పాక్ సమస్యలు పరిష్కారం కావాలన్నది తమ అభిమతమని స్పష్టం చేసింది. అయితే పాక్ ఉగ్రవాద చర్యలను అణచివేసే విషయంలో మాత్రమే అంతర్జాతీయ ప్రమేయాన్ని, జోక్యాన్ని కోరుతున్నామని తెలిపింది.