జాతీయ వార్తలు

టెర్రరిజానికి పాక్ ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: మానవత్వానికి తావివ్వకూడదన్న ఒకే ఒక ఆలోచననుంచే ఉగ్రవాదం పుట్టుకొస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దక్షిణాసియాలో నెలకొన్న ఈ ఆలోచన కారణంగానే ఉగ్రవాదం జడలు విప్పుతోందని పరోక్షంగా పాకిస్తాన్‌పై తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ అనేది కేవలం భారత్‌కే పరిమితం కాదని పొరుగుదేశాలకు కూడా వర్తిస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందనిదే భారత దేశ అభివృద్ధి పరిపూర్ణం కాదని ఆయన అన్నారు.‘ఈ ప్రాంతంలోని అన్ని దేశాలకు మనం స్నేహహస్తాన్ని చాచి, మన అభివృద్ధిలో
భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించాం. ఎలాంటి స్వార్థం లేకుండానే ఈ మొత్తం ప్రాంతం మేలును మనం కోరుకున్నాం. సహకారానికి మన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచాం. అయితే అందుకు ఉగ్రవాదాన్ని వదిలిపెట్టాలి’ అని పరోక్షంగా పాక్‌నుద్దేశించి అన్నారు. ‘దక్షిణాసియాలో పుట్టిన ఒకే ఒక ఆలోచన.. ఉగ్రవాదం పుట్టేందుకు రగిల్చేందుకు, ప్రోత్సహించేందుకు కారణమవుతోంది. మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి మొగ్గు చూపే బుర్రల్లోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఇది’ అని ప్రధాని అన్నారు. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాలను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సత్కరించినచిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.
‘ఇది చాలా ముఖ్యమైన రోజు. విమోచన యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను మనం గుర్తు చేసుకుంటున్నా’మని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో 1661 మంది జవాన్లు అమరులైనారని అంటూ, వీరి త్యాగాలను ఎప్పటికీ మరువలేమన్నారు. భారత సైన్యం తన విధి నిర్వహణనుంచి ఎప్పుడూ పారిపోలేదని, యుద్ధ సంప్రదాయాలను పాటిస్తూ ఆదర్శంగా నిలిచిందని ఆయన చెప్పారు. 1971 యుద్ధం తర్వాత 90 వేల మంది యుద్ధ ఖైదీలను క్షేమంగా విడిచిపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కాగా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ బంగ్లాదేశ్ చరిత్ర భారత అమర జవాన్లు, బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యోధుల రక్తంతో లిఖించబడిందని అన్నారు. వారి త్యాగాలను ఇరు దేశాలు కూడా తరతరాలుగా గుర్తు చేసుకుంటూనే ఉన్నాయని అన్నారు.
సత్వర పరిష్కారం
తీస్తా జలాల సమస్యకు వీలయినంత త్వరలో పరిష్కారం కనుగొంటామని అంతకు ముందు ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌కు హామీ ఇచ్చారు. బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో చర్చల అనంతరం ఆమెతో కలిసి విలేఖరుల సమావేశంలో మోదీ మాట్లాడుతూ తీస్తా నదీ జలాల పంపిణీ ఒప్పందం ఇరు దేశాల సంబంధాలకు చాలా ముఖ్యమని ఆయన అంటూ, వీలయినంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటామని చెప్పారు. తీవ్రవాద భావాల వ్యాప్తి తమ రెండు దేశాలకే కాక మొత్తం దక్షిణాసియా ప్రాంతానికి పెను ముప్పుగా పరిణమిస్తోందని ప్రధాని చెప్పారు. ఉగ్రవాదం పట్ల షేక్ హసీనా ప్రభుత్వం అత్యంత కఠినమైన వైఖరిని అవలంబిస్తోందంటూ ఆయన ప్రశంసించారు.