జాతీయ వార్తలు

విశాఖ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గురువారం లోక్‌సభలో 377 నిబంధన కింద మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రైల్వే జోన్ ఎంతో అవసరమని చెప్పారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్, వాల్తేర్ డివిజన్లతో విశాఖలో కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈస్ట్‌కోస్ట్ డివిజన్ ఆదాయంలో దాదాపు యాభై శాతం ఆదాయం వాల్తేర్ జోన్‌నుండే వస్తోందని శ్రీనివాస్ తెలిపారు. వాల్తేర్ డివిజన్ నుండి సాలీనా 6,280 కోట్ల రూపాయలు వస్తోందని ఆయన చెప్పారు. విశాఖపట్నంలో రెండు ప్రధా ఓడరేవులతోపాటు కావలసినంత భూమి ఉన్నదని శ్రీనివాస్ అన్నారు. అతిపెద్ద లోకోషెడ్డుతోపాటు కోచ్ నిర్వహణా కేంద్రం కూడా ఇక్కడే ఉన్నదని చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతో ఉన్నదని ఆయన స్పష్పం చేశారు.