జాతీయ వార్తలు

శ్రీనగర్ ఉప ఎన్నిక హింసాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఏప్రిల్ 9: జమ్మూ-కాశ్మీరులోని శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఆదివారం నిర్వహించిన ఉప ఎన్నిక హింసాత్మక ఘటనలతో అట్టుడికింది. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు కేవలం 5.84 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు బద్గావ్ జిల్లా చరారే షరీఫ్‌లోని పకీర్‌పురాలోనూ, మరో ఇద్దరు బీర్వా ఏరియాలోనూ హతమవగా, ఇదే జిల్లాలోని చదూరా ఏరియాలో ఒకరు, మగావ్ టౌన్‌లో మరొకరు మృతిచెందారు. శ్రీనగర్ ఉప ఎన్నికను నిరసిస్తూ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో బద్గావ్ జిల్లాలో ఎన్నికల సిబ్బంది దాదాపు 70 శాతం పోలింగ్ బూత్‌లను మూసివేశారని అధికారులు తెలిపారు. గండేర్బల్ జిల్లాలో ఒక పోలింగ్ బూత్‌కు పెట్రోల్ బాంబులు విసరడంతో పాటు భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్విన అల్లరి మూకను చెదరగొట్టేందుకు సైనిక జవాన్లను రంగంలోకి దింపాల్సి వచ్చింది. అలాగే బద్గావ్ జిల్లా చరారే షరీఫ్ ఏరియాలోని పకీర్‌పురా పోలింగ్ స్టేషన్‌ను మట్టడించిన వందలాది మంది నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఆరుగురికి గాయాలయ్యాయని, వీరిలో మొహమ్మద్ అబ్బాస్ (20), ఫైజాన్ అహ్మద్ (15) అనే ఇద్దరు యువకులు బుల్లెట్ గాయాలతో మృతిచెందారని అధికారులు వివరించారు. ఇదేవిధంగా బీర్వా ఏరియాతో పాటు చదూరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దౌలత్‌పురా, మగావ్ టౌన్‌లో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో మరో నలుగురు మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. కాగా, శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను సజావుగా నిర్వహించడంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా విమర్శించారు.

చిత్రం..జమ్మూ-కాశ్మీరులోని శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అల్లరి మూకలను చెదరగొడుతున్న భద్రతా దళాలు