జాతీయ వార్తలు

వినియోగదారుల హక్కులపై వాస్తవ దృక్పథంతో వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: సేవలను అందించే సంస్థలతో పోలిస్తే వినియోగదారులే ఎక్కువ ప్రతికూల పరిస్థితుల్లో ఉంటారు గనుక వినియోగదారులకు సంబంధించిన వివాదాల్లో కోర్టులు వినియోగదారుల హక్కుల విషయంలో వాస్తవ దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1986లో పార్లమెంటు వినియోగదారుల రక్షణ చట్టాన్ని చేసిందని కోర్టు అంటూ, క్లెయిమ్‌ను పరిష్కరించడంలో జాప్యానికి సేవలను అందించే సంస్థే కారణమైనప్పుడు ఈ చట్ట వినియోగదారుడికి ప్రతికూలంగా మారకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థతో బీమా చేసిన ఒక సంస్థకు రూ.21.05 లక్షల రూపాయలను వడ్డీతో పాటుగా చెల్లించాలని ఆదేశిస్తూ 2007 ఏప్రిల్‌లో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేసిన సందర్భంగా న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, పిసి పంత్‌లతో కూడిన బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. వరదలు, జలప్రళయం లాంటి ప్రకృతి విపత్తుల కారణంగా తమ ఫ్యాక్టరీ భవనాలు, యంత్రాలకు ఎదురయ్యే ముప్పులనుంచి రక్షణలను కల్పించే రెండు పాలసీలను కోల్‌కతాకు చెందిన హిందుస్థాన్ సేఫ్టీ గ్లాస్ వర్క్స్ లిమిటెడ్ అనే కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద రెండు పాలసీలు తీసుకుంది. 1992 ఆగస్టు 6న కోల్‌కతాలో కుండపోతగా కురిసిన వర్షాలకు తమ ఫ్యాక్టరీలో ముడి సరకుకు, నిల్వలకు, యంత్రాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంటూ కంపెనీ క్లెయిమ్ కోసం బీమా సంస్థను ఆశ్రయించింది. జరిగిన నష్టాన్ని అంచనా వేయడం కోసం ఆ కంపెనీ ఒక సర్వేయర్‌ను నియమించింది. కంపెనీకి 24 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొంటూ సర్వేయర్ ఒక నివేదిక సమర్పించింది. అయితే బీమా సంస్థ ఆ నివేదికను తిరస్కరిస్తూ మరో సర్వేయర్‌ను నియమించగా, అదికూడా రూ. 26 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొంటూ నివేదిక ఇచ్చింది. దీంతో బీమా చేసిన కంపెనీ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల ట్రిబ్యునల్‌లో పరిహారం కోసం పిటిషన్ దాఖలు చేయగా, 21,05,803 చెల్లించాలంటూ కమిషన్ తీర్పు చెప్పింది. కాగా, మరో ప్రైవేటు సంస్థకు సంబంధించి కమిషన్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నేషనల్ ఇన్సూరెన్స్ సంస్థ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.