జాతీయ వార్తలు

చెన్నైలో కుంగిన రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 9: తమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బిజీగా ఉండే అన్నాసాలై (వౌంట్ రోడ్డు)లోని జెమిని బస్‌స్టాప్ వద్ద రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో ఒక సిటీ బస్సు, మరో కారు గోతిలో దిగబడి పోయాయి. అయితే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. సిటీ బస్సు జెమినీ బస్టాప్ వద్ద ఆగి ఉండగా, కారు దాని పక్కనుంచి వెళ్తోంది.
ఒక్కసారిగా బస్సు భూమిలోకి దిగబడిపోతున్నట్లు అనిపించడంతో టైరు పంక్చరయిందేమోనని అనుమానంతో డ్రైవర్ బస్సు దిగి చూశాడు. అయితే రోడ్డు కుంగిపోవడం కనిపించడంతో డ్రైవర్ బస్సులోని ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ఆ సమయంలో సిటీ బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులున్నారు. వారంతా భయంతో బస్సులోంచి దూకేశారు. అలాగే కారు గోతిలో దిగబడి పోతూ ఉండడం చూసి కారులో ఉన్న వ్యక్తి కూడా బైటికి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు టనె్నల్ పనులు జరుగుతున్న ప్రాంతానికి దగ్గర్లోనే జరిగింది. నెల రోజుల క్రితమే చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ఇక్కడ టనె్నల్ పనులు చేపట్టింది. వారం రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో రోడ్డు కుంగిపోయిన ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో జనం ఆందోళనకు గురయ్యారు. రోడ్డు మధ్యలో దాదాపు నాలుగైదు అడుగుల మేర పెద్ద గొయ్యి పడ్డంతో బస్సు, కారు ముందు భాగాలు రెండూ గోతిలో దిగబడిపోయాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి డి జయకుమార్, పోలీసు, ఇతర జిల్లా ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు.ఈ సంఘటనను ఓ అనుభవంగా తీసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి విలేఖరులకు చెప్పారు. సోమవారం సాయంత్రానికి ఈ మార్గంలో ట్రాఫిక్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. కాగా, గోతిలో దిగబడిపోయిన రెండు వాహనాలను క్రేన్ల సాయంతో బైటికి తీశారు.

చిత్రం..చెన్నైలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో గోతిలో దిగబడి పోయన సిటీ బస్సు, కారు