జాతీయ వార్తలు

సంపూర్ణ మద్య నిషేధం దిశగా మధ్యప్రదేశ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఏప్రిల్ 10: మధ్యప్రదేశ్ సంపూర్ణ మద్యనిషేధం దిశగా సాగబోతున్నది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గల అన్ని మద్యం షాపులను దశలవారీగా మూసివేస్తామని ఆయన ప్రకటించారు. నర్సింగ్‌పూర్ జిల్లా నీమ్‌ఖేరా (హీరాపూర్) గ్రామంలో ఆదివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘అన్ని మద్యం షాపులను దశలవారీగా మూసివేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం’ అని అన్నారు. ‘నమామి దేవి నర్మదే- నర్మదా సేవా యాత్ర’ పేరిట నది సంరక్షణ కోసం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి నిర్వహిస్తున్న ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలి దశలో నర్మదా నది తీరానికి అయిదు కిలో మీటర్ల లోపు దూరంలో గల అన్ని మద్యం షాపులను రాష్ట్ర ప్రభుత్వం మూసివేస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తరువాత దశలో నివాస ప్రాంతాల్లోని, విద్యాసంస్థలు, ప్రార్థనా స్థలాలకు సమీపంలోని మద్యం షాపులు తెరవడానికి అనుమతించడం జరుగదని ఆయన చెప్పారు. మద్యానికి బానిసలయిన వారిని దానినుంచి బయటపడవేయడానికి రాష్ట్రంలో త్వరలోనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని సిఎం తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల్లో మద్యం షాపులకు వ్యతిరేకంగా అనేక నిరసనలు జరిగాయి. రాయిసెన్ జిల్లా బరేలి పట్టణంలో ఈ నెల అయిదో తేదీన ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అధికారులు నేషనల్ హైవే పక్కన ఉన్న మద్యం షాపులను నివాస ప్రాంతాలకు తరలించడానికి పూనుకోవడంతో ఆగ్రహించిన స్థానిక ప్రజలు రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. మరో నాలుగు వాహనాలను ధ్వంసం చేశారు. ఇండోర్, సాగర్, బుర్హాన్‌పూర్, ఛాతర్‌పూర్, విదిష, నర్సింగ్‌పూర్, సాత్నా, మొరేనా, దేవాస్, ఇతర పట్టణాలలో గత నెల రోజులుగా ప్రజలు మద్యం షాపులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.